Sankarabharanam digital version release date

Sankarabharanam Digital Version Release on march 13, Sankarabharanam Digital Version Release date, Sankarabharanam Digital Version, Sankarabharanam Official Trailer, Sankarabharanam Digital Trailer, Sankarabharanam latest trailer, Sankarabharanam latest tamil, Sankarabharanam news, Sankarabharanam movie news, Sankarabharanam tamil news, Sankarabharanam trailer

Sankarabharanam Digital Version Release Date: Telugu classic Sankarabharanam in Tamil. The Telugu classic Sankarabharanam that was released in 1979, changed the face of Telugu cinema. And after 35 years of its release, the film is now releasing in Tamil on march 13, in a digital format.

మార్చి 13న తమిళ డిజిటల్ శంకరాభరణం

Posted: 03/10/2015 11:36 AM IST
Sankarabharanam digital version release date

కళాతపస్వీ ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసీకల్ మ్యూజికల్ హిట్ చిత్రం ‘శంకరాభరణం’. ‘శంకరా.... నాద శరీరాపర...’ అంటూ సాక్షత్తూ శివుడే ప్రత్యక్షమయ్యే విధంగా ఓ భక్తుడు పాడుతున్నట్లుగా ఈ సినిమాలో జె.వి.సోమాయాజులు అద్భుతంగా నటించారు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ మారుమ్రోగుతూనే వున్నాయి.

ఈ సినిమాలో సోమాయాజులు గారి నటన తెలుగు సాంప్రదాయ సంగీత సంస్కృతిని మరింత ఒకమెట్టు పెంచే విధంగా వుంటుంది. దాదాపు 35 ఏళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం మరోసారి వెండితెర మీద అలరించబోతుంది. ఈ చిత్రాన్ని ప్రస్తుతం డిజిటలైజ్ చేసి తమిళంలో మళ్లీ విడుదల చేయబోతున్నారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటలైజ్ చేసి, 5.1 సౌండ్ సిస్టమ్ హంగులద్దారు. కలర్ కరెక్షన్ చేసి ఈ సినిమాను స్కోప్‌లోకి మార్చారు. రీ-రికార్డింగ్ కూడా పాత నోట్స్ తోనే కొత్త ఫార్మాట్ లో అందిస్తున్నారు. ఈ చిత్రరాజాన్ని మరింత ద్విగుణీకృతం చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు.

దాదాపు ఏడాది కష్టపడి ఈ చిత్రానికి సరికొత్త వన్నెలు అద్దారు. ఈ డిజిటల్ చిత్రాన్ని తమిళంలో మార్చి 13న విడుదల చేయనున్నారు. శ్రీ శబరిగిరి వాసన్ మూవీస్ నిర్మాత. ఈ సినిమా డిజిటల్ వెర్షన్‌ని తెలుగులో కూడా విడుదల చేసే యోచనలో ఉన్నారు.

జెవి సోమయాజులు, మంజు భార్గవి, చంద్ర మోహన్ ప్రధాన పాత్రలలో నటించారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు. గతంలో ‘శంకరాభరణం’ తెలుగు వెర్షనే తమిళనాట సిల్వర్ జూబ్లీ ఆడింది. మరి ఈ తమిళ వెర్షన్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sankarabharanam  Digital Version  Release date  

Other Articles