Jadugadu movie first look poster hero naga shourya

jadugadu movie news, jadugadu first look poster, jadugadu movie shooting, jadugadu movie news, hero naga shourya, hero naga shourya movie, naga shourya news, naga shourya jadugadu movie, naga shourya movie updates

jadugadu movie first look poster hero naga shourya : The first look poster of latest telugu movie jadugadu in which hero naga shourya playing in lead role.

ఆ ‘జాదూగాడు’ ఎవరో తెలిసిపోయింది..?

Posted: 03/07/2015 12:57 PM IST
Jadugadu movie first look poster hero naga shourya

ఇటీవలేకాలంలో యువహీరోలందరూ డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు తమ సినిమాలకు ఎక్కువ కలెక్షన్లను రాబట్టుకోవడం కోసమే కొత్త కథాచిత్రాలను ఎన్నుకొంటున్నారు. అంతేకాదు.. తమ సినిమాలకు వెరైటీ పబ్లిసిటీ కూడా చేసుకుంటుంటారు. అలా చేస్తే తమ మూవీలకు మరింత క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. అందుకే.. ఫస్ట్ లుక్ పోస్టర్ల నుంచి మూవీ విడులయ్యేవరకు డిఫరెంట్ గా తమ చిత్రాలను ప్రమోట్ చేసుకుంటున్నారు.

ఇక విషయానికొస్తే.. హోలీ పండుగ సందర్భంగా ‘జాదూగాడు’ అనే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయ్యింది. అందులో హీరో ఫేస్ ని చూపించుకుండా చేతిలో గన్ పట్టుకుని పరుగులు తీస్తున్నట్లుగా అతని కాళ్లు మాత్రమే కనిపించేటట్లు ఆ పోస్టర్ ని విడుదల చేశారు. అలాగే యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వున్న ఆ ఫోటో.. ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. దీంతో ఆ పోస్టర్ లో వున్న హీరో ఎవరా..? అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆ ‘జాదుగాడు’ మరెవరో కాదు.. యువహీరో నాగశౌర్య అని తెలిసింది.

‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో మంచి గుర్తింపు సాధించిన నాగశౌర్య.. తర్వాత ‘దిక్కులు చూడకు రామయ్య, ‘లక్ష్మి రావే మా ఇంటికి’ సినిమాలతో వరుస విజయాలు సాధించింది. ఆ సినిమాల్లో ప్రేమికుడిగా నటించి ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకున్న ఈ యువహీరో.. ఇప్పుడు ‘జాదుగాడు’తో యాక్షన్ రూట్ లోకి ఎంటర్ అయ్యాడని సమాచారం. ఈ చిత్రాన్ని ‘చింతకాయల రవి’ ఫేం యోగి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jadugadu movie updates  naga shourya news  tollywood news  

Other Articles