Rakul preet singh latest interview telugu movie offers tollywood news

rakul preet singh latest news, rakul preet singh interview, rakul preet singh photos, rakul preet singh gossips, rakul preet singh press meet, rakul preet singh photo shoot, rakul preet singh movies, rakul preet singh kick 2 movie, rakul preet singh mahesh babu, rakul preet singh ntr, rakul preet singh ram charan, rakul preet singh movie updates

rakul preet singh latest interview telugu movie offers tollywood news : Rakul preet singh doesn't like to become super star. But she want to become a good actress by her acting skills.

‘సూపర్ స్టార్’గా పిలిపించుకోవాలని లేదట!

Posted: 02/27/2015 11:42 AM IST
Rakul preet singh latest interview telugu movie offers tollywood news

ఇండస్ట్రీలో వున్న హీరోయిన్లందరూ ‘స్టార్ ఇమేజ్’ను కైవసం చేసుకోవడానికి పోటీలు పడుతుంటారు. తమనుతాము ‘సూపర్ స్టార్’గా పిలిపించుకోవడం కోసం తహతహలాడుతుంటారు. కానీ.. రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతోంది. తనకు స్టార్ లేదా సూపర్ స్టార్ గా పిలిపించుకోవాలని లేదంటూ ఆమె చెబుతోంది.

ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన తక్కువకాలంలోనే వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. మొదట చిన్నహీరోల సరసన నటిస్తూ విజయాలు సాధించిన ఈమె... ఇప్పుడు పెద్ద హీరోల సరసన నటించే భారీ ఆఫర్లను దక్కించుకుంది. ప్రస్తుతం రవితేజ సరసన ‘కిక్-2’ చిత్రంలో నటిస్తున్న ఈ భామ.. త్వరలోనే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో జతకట్టనుంది. అటు బాలీవుడ్ నుంచి కూడా ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయినందుకు మీరెలా ఎగ్జైట్ అవుతున్నారు’ అని ఆమెను ప్రశ్నించగా.. అందుకు బదులుగా ఆమె తనకు సూపర్ స్టార్ గా పిలుపించుకోవాలని లేదంటూ ఆశ్చర్యపరిచింది.

అయితే.. ‘‘మంచినటి అని పిలిపించుకోగలిగితే చాలని, అదే తనకు పెద్ద పురస్కారం’’ అని వెల్లడిస్తోంది రకుల్! తనను ఇంతగా అభిమానిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతున్న ఈ భామ.. వారికి నచ్చినట్లుగానే మంచి పాత్రలు చేస్తూ వారిని మెప్పించడానికి ప్రయత్నిస్తానని పేర్కొంటోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rakul preet singh  telugu movies  tollywood news  

Other Articles