Shakeela latest interview romantic target movie news

shakeela news, shakeela interview, shakeela movie news, shakeela movies, shakeela romantic target movie, romantic target movie news

shakeela latest interview romantic target movie news : Shakeela shares her first experience when she entered in film industry.

‘వర్జిన్’ అంటే ఏమిటో తెలియదంటున్న షకీలా..

Posted: 02/27/2015 11:29 AM IST
Shakeela latest interview romantic target movie news

ఒకప్పుడు మలయాళ స్టార్ హీరోలను సైతం తన శృంగారచిత్రాల కలెక్షన్స్ తో భయపెట్టిన షకీలా.. అప్పట్లో దక్షిణాది ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. అయితే.. రానురాను ఇంటర్నెట్ మాధ్యమం వాడకం ఎక్కువగా పెరిగిపోయిన నేపథ్యంలో ఆమె మార్కెట్ కాలక్రమంలో పూర్తిగా తగ్గిపోయింది. ఈ దెబ్బతో ఆమె సినిమాలు రావడం తక్కువయ్యాయి. అనంతరం తెలుగు, తమిళ భాషాచిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది.

అయితే.. అవి కూడా తగ్గిపోవడంతో ఇప్పుడు దర్శకురాలిగా అవతారమెత్తింది. తాజాగా ఈమె ‘రొమాంటిక్ టార్గెట్’ పేరిట ఓ చిత్రాన్ని తెరకెక్కించింది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్వూలు ఇస్తున్న షకీలా.. తన జీవితంలో ఎదురైన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను 16వ ఏటలో వున్నప్పుడు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిందని పేర్కొన్న ఆమె.. అప్పుడు వర్జిన్ అనే పదానికి అర్థం తెలియదంటూ గత అనుభవాలను తెలియపరిచింది.

ఈ వ్యవహారం గురించి ఆమె విశ్లేషిస్తూ.. ‘నేను నా 16వ ఏటలో సినిమాలో ఎంట్రీ ఇచ్చాను. మొదట సినిమాలో రొమాన్స్ సన్నివేశంలో నటించాల్సి వచ్చినప్పుడు ముఖంలో ఆ భావాలను పలికించాలి, కాళ్ళు కుడా కదిలించాలని డైరెక్టర్ చెప్పాడు. అయితే ఆ భావాలను ఎలా పలికించాలో నాకు తెలియదు. ఎంత ప్రయత్నించినప్పటికీ చేయలేకపోయాను. అప్పుడు డైరెక్టర్ నా దగ్గరకొచ్చి.. ‘నువ్వు వర్జిన్ వా’ అని ప్రశ్నించారు. ‘అంటే ఏమిటి?’ అని అన్నాను. నాకు దాని అర్థం కుడా తెలియదు’ అని చెప్పినట్లుగా ఈమె వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shakeela latest news  romantic target movie updates  

Other Articles