Director teja forest love story rain backdrop movie producer damodara prasad

director teja news, director teja love story, director teja love affairs, director teja movies, producer damodara prasad, tollywood news

director teja forest love story rain backdrop movie producer damodara prasad : After a long time director teja has started his new project with new actors.

ఫారెస్ట్ లో ప్రేమాయణం నడుపుతున్న దర్శకుడు తేజ

Posted: 02/20/2015 08:15 PM IST
Director teja forest love story rain backdrop movie producer damodara prasad

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో లో బడ్జెట్టు సినిమాలు తీసి పలు హిట్లు అందుకున్నాడు దర్శకుడు తేజ! దీంతో స్టార్ ప్రొడ్యూసర్లు సైతం ఇతనితో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపేవారు. కానీ.. ఇతనిని దురదృష్టం వెంటాడటంతో వరుసగా ఫ్లాపులు చవిచూశాడు. గత కొంతకాలంగా సక్సెస్ అనే మాట ఇతని దరిదాపుల్లోకి రాలేకపోతోంది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన తేజ.. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోయాడు. ఒంటరిగా తన జీవితాన్ని కొనసాగించాడు. కట్ చేస్తే.. ఇప్పుడు తాజాగా ఓ ఫారెస్ట్ లో ప్రేమాయణం నడుపుతున్నాడని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

అసలు విషయం ఏమిటంటే.. కొన్నాళ్లనుంచి సక్సెస్ లేక సతమతమవుతున్న తేజ.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన ప్రయత్నాలు తాను కొనసాగిస్తాడు. ఒక్క హిట్టైనా సాధించాలని తాపత్రయం పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఖాళీగా వున్న సమయంలో ఓ ప్రేమకథను ప్రిపేర్ చేసి, నిర్మాత దామోదరప్రసాద్ కు వినిపించాడు. ఆ కథ విని ఇంప్రెస్ అయిన నిర్మాత.. వెంటనే అతనితో మూవీ తీసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దీంతో మనోడి పంట పండినట్లైంది. నిర్మాత తన మనసు మార్చుకోకముందే వెంటనే షూటింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టేశాడు కూడా!

ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రం ప్రస్తుతం మంగళూరు సమీపంలోని ఓ ఫారెస్టులో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కథ అటవీ నేపథ్యంలో, వర్షం బ్యాక్ డ్రాప్ లోనే కొనసాగుతుందట! ఇలా ఈ విధంగా తేజ ఓ ఫారెస్టులో కొత్త నటీనటులతో తన ప్రేమకథను నడుపుతున్నాడన్నమాట. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు వెలువడి కానున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : director teja love story  producer damodara prasad  tollywood news  

Other Articles