Anil ravipudi pawan kalyan allu arjun offers tollywood news

pawan kalyan news, anil ravipudi news, anil ravipudi pataas movie, pataas movie collections, pawan kalyan anil ravipudi news, pawan kalyan gabbar singh 2 movie, gabbar singh 2 movie updates, kalyan ram news

anil ravipudi pawan kalyan allu arjun offers tollywood news : The writer turned director got offer from power star pawan kalyan for his latest movie.

‘పటాస్’ పేల్చాడు.. ‘పవర్’ చేతిలో పడ్డాడు..

Posted: 02/16/2015 07:05 PM IST
Anil ravipudi pawan kalyan allu arjun offers tollywood news

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తన స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ‘పటాస్’ చిత్రం ఇటీవలే విడుదలై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే! చాలాకాలం నుంచి సక్సెస్ లేక ఆందోళనలో వున్న కళ్యాణ్ రామ్ కి ఈ మూవీతో కాస్త ఊరట లభించింది. ఇక ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన రచయిత అనిల్ రావిపూడికీ ఈ చిత్రం మంచి పేరు తెచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ మూవీ కళ్యాణ్ రామ్ కంటే దర్శకుడు అనిల్ కే ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది. దీంతో ఇతనికి వరుసగా భారీ ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.

ఆమధ్య ఈ దర్శకుడికి మెగాహీరో అల్లు అర్జున్ నుంచి ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపించాయి. అయితే.. అందుకు సంబంధించిన వివరాలు ఇంకా వెలువడి కాలేదు. అయితే.. ఇప్పుడు తాజాగా ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి ఇతనికి పిలుపు వచ్చిందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన విషయాలు బయటికొస్తాయని అంటున్నారు. మరి.. ఇందులో నిజమెంతుందదో తెలియాలంటే మరికొన్నాళ్లవరకు ఆగాల్సిందే! ఏదైతేనేం.. ఇక్కడ అనిల్ రావిపూడి పేరు మాత్రం రోజురోజుకి బాగా ట్రెండ్ అవుతూ వస్తోంది! చూస్తుంటే.. ఇతడు త్వరలోనే మెగా ఆఫర్ దక్కించుకునే అవకాశాలున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles