Temper junior ntr movie tv satelite rights gemini television

temper movie news, temper movie collections, junior ntr temper movie, temper tv satelite rights, temper satelite rights, gemini tv satelite rights, gemini tv programmes, kajal agarwal news, puri jagannath news, bandla ganesh news

temper junior ntr movie tv satelite rights gemini television : Gemini tv bags junior ntr's temper movie satelite rights with 7.5 crores.

దయాగాడి దండయాత్రకు బుల్లితెర బద్దలైంది!

Posted: 02/16/2015 08:26 PM IST
Temper junior ntr movie tv satelite rights gemini television

చాలాకాలం నుంచి ఒక్క హిట్ దక్కగా తీవ్ర ఆవేదనలో కూరుకుపోయిన జూనియర్ ఎన్టీఆర్ కు ‘టెంపర్’ చిత్రం ఊరటనిచ్చింది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతోపాటు ఎన్టీఆర్ కు మంచి తెచ్చిపెట్టింది. గత సినిమాలతో పోల్చుకుంటే ఈ మూవీలో ఎన్టీఆర్ నటన ‘సూపర్బ్’ అంటూ ఎందరో ప్రముఖులు కితాబిచ్చారు. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర అద్భుతంగా వసూళ్లను రాబడుతోంది. మొదటిరోజు 9 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. మొత్తం మూడురోజులకుగాను 18 కోట్లమేర కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం రైట్స్ దక్కించుకోవడం కోసం టీవీ చానెళ్లు బాగానే పోటీపడ్డాయి. ఈ క్రమంలో జెమిటీ టీవీ 7.5 కోట్ల రూపాయలు మొత్తం వెచ్చించి ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ని చేజిక్కించుకుంది. ఇదివరకు ఎన్టీఆర్ నటించిన ఏ చిత్రం ఇంత భారీ రేటుకు అమ్ముడుపోలేదు. శాటిలైట్ రైట్స్ కోసం ఇంత క్రేజ్ ఎప్పుడూ రాలేదు. అంటే.. మొదటిసారి ఎన్టీఆర్ బుల్లితెరపై తన దండయాత్రను ప్రదర్శించాడన్నమాట! ఈ దెబ్బతో ఇటు ఎన్టీఆర్ కు మంచి పేరు రావడంతోపాటు అటు నిర్మాతకు కాసుల వర్షం బాగానే కురుస్తోంది. ఈ సినిమాతో నిర్మాత బాగానే రాబట్టుకున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : temper movie collections  temper satelite rights  junior ntr news  kajal agarwal  

Other Articles