Allu arjun next movie confirmed with boyapati srinu

Allu Arjun Next Movie Confirmed with Boyapati Srinu, Allu Arjun Boyapati Srinu Movie Confirmed, Allu Arjun latest movie news, Allu Arjun boyapati movie, Allu Arjun latest updates, Allu Arjun boyapati movie updates, boyapati srinu new movie, Boyapati srinu Allu Arjun movie, Boyapati srinu, Allu Arjun, movie, Thaman music

Allu Arjun Next Movie Confirmed with Boyapati Srinu: Allu Arjun is busy with the shooting of Trivikram's project. After this he is doing boyapati movie. Arjun may join Boyapati movie shooting after completing Trivikram's movie.

కన్ఫర్మ్: బోయపాటి దర్శకత్వంలో రేసుగుర్రం కాంబినేషన్

Posted: 02/14/2015 12:08 PM IST
Allu arjun next movie confirmed with boyapati srinu

‘లెజెండ్’ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా రూపొందనుందని తెలిసిందే. ఇందుకు సంబంధించిన చిత్ర ముహూర్త కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగాయి. అయితే బడ్జెట్ సమస్య వల్ల ఈ ప్రాజెక్టును పక్కన పెట్టినట్లుగా తెలిసింది.

బోయపాటి శ్రీను మాత్రం బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా కోసమే ఎదురుచూడకుండా తన కొత్త చిత్రానికి సిద్ధమయ్యాడు. బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ చిత్రం రూపొందనుందని గతంలో వార్తలొచ్చాయి. కానీ ఈ వార్తలు నిజమేనని తెలిసింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా నటిస్తున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

ఈ సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే నెల చివరి వారంలో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడిగా ఖరారు చేసారు.

థమన్, బన్నీ కాంబినేషన్ లో ఇప్పటికే ‘రేసుగుర్రం’ అనే బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం వచ్చింది. కానీ బోయపాటి-థమన్, బోయపాటి-బన్నీల కాంబినేషన్ మాత్రం మొదటిసారి కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Boyapati Srinu  Thaman  Movie  Confirmed  Music  

Other Articles