Manchu manoj praneeta reddy engagement date fix news mohan babu family members

manchu manoj news, manchu manoj engagement, manchu manoj praneeta reddy, manchu manoj love affairs, manchu manoj affairs, manoj praneeta reddy news, manoj praneeta engagement, praneeta reddy news, mohan babu news, manchu family members

manchu manoj praneeta reddy engagement date fix news mohan babu family members : The Rocking star manchu manoj engagement date is fixed with praneeta reddy on march 4.

ప్రణీతతో మంచుమనోజ్ నిశ్చితార్థం ఫిక్స్

Posted: 02/13/2015 11:25 AM IST
Manchu manoj praneeta reddy engagement date fix news mohan babu family members

గతకొన్నాళ్ల కిందట హీరో మంచు మనోజ్ బిట్స్ పిలానీ కాలేజికి చెందిన ప్రణీత అనే అమ్మాయితో ప్రేమాయణం నడుపుతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే! ఈ వార్తలు వచ్చాయో లేదో వెంటనే దీనిపై సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు స్పందించారు. తన కుమారుడి ప్రేమ వ్యవహారం గురించి మీడియాలో వస్తున్న వార్తలు నిజమేనని పేర్కొన్న ఆయన.. ఇరువురి కుటుంబాలు వారి వివాహానికి అంగీకరించిన విషయాలను వెల్లడించారు. త్వరలోనే నిశ్చితార్థ, వివాహ వేడుకలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తామని ఆయన ఆనాడు వెల్లడించారు.

అందులో భాగంగా తాజాగా ప్రణీత, మనోజ్ నిశ్చితార్థాన్ని ఖరారు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మార్చి 4వ తేదీన వారి నిశ్చితార్థం ఓ స్టార్ హోటల్’లో ఉదయం 10.30 నిముషాలకు జరగనున్నట్లు సమాచారం! ఈ వేడుకకు టాలీవుడ్’లో వున్న నటీనటులు, ప్రముఖ రాజకీయ నాయకులను ఆహ్వానిస్తున్నారు. ఈ నిశ్చితార్థ వేడుకలను పూర్తి తెలుగు సంప్రదాయ పద్ధతుల్లోనే చేయాలని రెండు కుటుంబాలు నిర్ణయించుకున్నట్లు మనోజ్ మిత్రుడు వెల్లడించారు. మొదట మనోజ్ ఇంట్లో పూజ నిర్వహించి, అనంతరం హోటల్ లో ఉంగరాలు మార్చుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఇదిలావుండగా.. మంచు విష్ణు భార్య విరానికాకు ప్రణీత రెడ్డి మంచి ఫ్రెండ్ అన్న విషయం తెలిసిందే! ఈ ఫ్రెండ్ షిప్పే ప్రణీతను మనోజ్ కు దగ్గర చేసింది. అలా వారు దీర్ఘాకాల ఫ్రెండ్స్’గా కొనసాగుతూ వచ్చారు. ఆ స్నేహం కాలక్రమంలో ప్రేమగా మారింది. దాంతో వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. తమ మనసులోని మాటను కుటుంబసభ్యులకు తెలుపగా.. అందుకు వారు అంగీకరించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles