Kajal agarwal interview temper movie updates ntr dance steps puri jagannath

kajal agarwal news, kajal agarwal temper movie, kajal agarwal hot photos, kajal agarwal ntr news, kajal agarwal hot gossips, kajal agarwal latest news, kajal agarwal photo shoot, kajal agarwal romancing videos, kajal agarwal ntr romance

kajal agarwal interview temper movie updates ntr dance steps puri jagannath : Kajal agarwal said that it is difficult to dance with junior ntr. she face some problems while dancing with ntr in temper movie.

వామ్మో! ఎన్టీఆర్’తో కలిసి చేయడం చాలా కష్టం!

Posted: 02/12/2015 01:48 PM IST
Kajal agarwal interview temper movie updates ntr dance steps puri jagannath

జూనియర్ ఎన్టీఆర్, కాజల్ జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టెంపర్’ చిత్రం ఈనెల 13వ తేదీన విడుదలకు సిద్ధంగా వుంది. ఈ నేపథ్యంలోనే మూవీని ప్రచారం చేస్తూ యూనిట్ బృందం ఫుల్ బిజీగా వుంది. ఈ మూవీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని, ఇందులో ఎన్టీఆర్ పాత్ర చాలా హైలైట్’గా వుంటుందని అందరూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే.. కాజల్ అగర్వాల్ మాత్రం అందుకు భిన్నంగా తన ఫీలింగ్ వెలిబుచ్చుతోంది. అసలు ఎన్టీఆర్’తో కలిసి చేయడం చాలా కష్టమంటూ ఈ అమ్మడు తేల్చి చెబుతోంది. అసలు కాజల్ ఇలా స్పందించడం వెనుక అసలు కారణం ఏంటి..? అని తెలియాలంటే మేటర్’లోకి వెళ్లాల్సిందే!

జూనియర్ ఎన్టీఆర్ ఎటువంటి డాన్సరో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎంతటి కష్టతరమైన స్టెప్పులైనా సరే.. అప్పటికప్పుడే నేర్చుకుని ఎంతో అలవోకగా చేసేస్తాడు. ఇతర హీరోలతో పోల్చుకుంటే తారక్ కాస్త స్పీడుగా, తనదైన స్టైల్లో డాన్స్ చేస్తాడు. తారక్’లో వున్న ఈ డాన్సింగ్ పెర్ఫార్మెన్స్’పై కాజల్ అగర్వాల్ తాజాగా తన అభిప్రాయం వెల్లడించింది. ‘‘ఎన్టీఆర్ ఈ గ్రేట్ డాన్సర్. ఎంత కష్టతరమైన స్టెప్ అయినా ఒక్కసారి చూస్తే చాలు.. రెండు నిముషాల్లో చేసేస్తాడు. ‘టెంపర్’ సినిమాలో అతని స్పీడ్ అందుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. అతనితో డాన్స్ చేయడం చాలా కష్టం’’ అని అంటోంది అమ్మడు!

ఇదివరకే తారక్’తో కలిసి ‘బృందావనం’, ‘బాద్ షా’ సినిమాలతో హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు ఎదురుచూస్తోంది. ఈ మూవీ విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. ఇక ఎన్టీఆర్ కూడా ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. గతకొన్నాళ్లనుంచి ఒక్క హిట్ దక్కకపోవడంతో.. ఈ మూవీపైనే ఆశలు వుంచుకున్నాడు. ఇక ఇందులో ప్రకాష్ రాజ్ విలన్’గా నటించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kajal agarwal latest  temper movie updates  kajal romance ntr  

Other Articles