Samantha ruthu prabhu denies garments brand ambassador

samantha latest new, samantha affairs, samantha rumours, samantha brand ambassadors, samantha hot photos, samantha photo shoot, samantha gallery, samantha interview, samantha english daily, samantha banian ad, samantha banian campaign, samantha ruthu prabhu

samantha ruthu prabhu denies garments brand ambassador : Samantha ruthu prabhu has denied the rumours on her. In earlier days there is a news goes viral that samantha getting deal with garments company for 6 crores.

ఆ రూమర్లను కొట్టిపారేసిన సమంత!

Posted: 02/07/2015 12:27 PM IST
Samantha ruthu prabhu denies garments brand ambassador

గ్లామర్ డాల్ సమంత ఓవైపు సినిమాలు చేసుకుంటూనే మరోవైపు అడ్వర్టయింగ్ రంగంలోనూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడు ఓ ప్రముఖ అండర్ గార్మెంట్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటుందని, అందుకు ఆమె రూ.6 కోట్లవరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోందని వార్తలు వచ్చాయి. అయితే.. ఆ వార్తల్లో నిజం లేదని, అవి కేవలం రూమర్లు మాత్రమేనంటూ సమంత వాటిని కొట్టిపారేసింది.

ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన సమంత.. తనపై వచ్చిన ఈ బ్రాండ్ రూమర్లను ఖండించింది. తాను ఏ అండర్ బ్రాండ్ గార్మెంట్స్ కంపెనీతోనూ ఒప్పందం కుదుర్చుకోలేదని, అవి కేవలం పుకార్లు మాత్రమేనంటూ తెలిపింది. ఇలాంటి వార్తలు ప్రచురించేముందు నిజానిజాలు తెలుసుకోవాలంటూ ఆమె హితువు పలికింది. అలాగే.. ఎన్ని కోట్లు ఆఫర్ వచ్చినా కొన్ని వాణిజ్య ప్రకటనల్లో నటించకూడదని సమంత నిర్ణయం తీసుకున్నట్లు ఆమె సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదిలావుండగా.. ప్రస్తుతం ఈ అమ్మడు అల్లుఅర్జున్ సరసన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మూవీలో నటిస్తోంది. అలాగే త్వరలో ప్రారంభం కానున్న రామ్ చరణ్ సినిమాకు సంతకం చేసింది. ఇక తమిళంలోనూ విక్రమ్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. ఇలా వరుసగా రెండు భాషల్లోనూ వరుసగా మూవీలు చేస్తున్న సమంత.. ప్రస్తుతం సమయం దొరకకపోవడం వల్ల చాలా బ్రాండ్’ల ఒప్పందాలను తిరస్కరించిందని అంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha ruthu prabhu news  banian garments companies  tollywood news  

Other Articles