Ram gopal varma affair sachin joshi tollywood news

ram gopal varma, sachin joshi, affair movie, affair telugu movie, tollwood affair movie, varma affair movie updates, varma affair movie details, varma movie news, varma affairs, ram gopal varma controversies, sachin joshi news, sachin joshi movies

ram gopal varma affair sachin joshi tollywood news : tollywood controversial director ram gopal varma is making movie with hero sachin joshi which is titled as Affair.

జోషితో రాంగోపాల్ వర్మ ‘ఎఫైర్’...

Posted: 02/07/2015 11:27 AM IST
Ram gopal varma affair sachin joshi tollywood news

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు సంబంధించిన మరో గమ్మత్తైన వార్త టాలీవుడ్’లో చక్కర్లు కొడుతోంది. జోషితో వర్మ ‘ఎఫైర్’.. అంటూ జోరుగా ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఈమేరకు వర్మ సన్నిహిత వర్గాలు కూడా ఈ వార్తలు నిజమేనంటూ వెల్లడిస్తున్నాయి.

వర్మ తన మూవీలకు ఎంచుకునే టైటిల్స్ చాలా గమ్మత్తుగానూ, అగ్రెస్సివ్ గానూ వుంటాయని తెలిసిందే! ఆడియెన్స్ అభిరుచికి సంబంధం లేకుండా తనకు నచ్చినట్లుగా మూవీ టైటిల్స్ ఖరారు చేస్తాడు వర్మ! ఇప్పుడు తాజాగా ఆ రకంగానే తాను రూపొందించే మూవీకి ‘ఎఫైర్’ అనే టైటిల్ నిర్ణయించినట్లు సమాచారం! ఈ మూవీలోనే నటుడిగా మంచి గుర్తింపు పొందిన సచిన్ జోషీ హీరోగా నటించనున్నాడు. తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీని రూపొందిస్తున్న వర్మ.. తెలుగులో ‘ఎఫైర్’ అని, హిందీ వెర్షన్ కి ‘మెంటల్’ అనే పేర్లు పెడుతున్నట్లు ఇండస్ట్రీవర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.

తన మూవీకి ‘ఎఫైర్’ అనే టైటిల్ పెట్టడం వల్ల యూత్ అందుకు ఆకర్షితులవుతన్నారన్న భావనతోనే ఆ పేరు పెట్టినట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా.. వర్మ ఈ కొత్త టైటిల్’తో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్’గా నిలిచిపోయాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram gopal varma  sachin joshi news  tollywood news  

Other Articles