Naga chaitanya latest movie updates director chandu mondeti news

naga chaitanya news, director chandu mondeti news, naga chaitanya movies list, naga chaitanya latest news, naga chaitanya interview, naga chaitanya movies, karthikeya movie news, karthikeya movie collections, karthikeya movie controversies, chandu mondeti news, karthikeya chandu mondeti, director sudheer varma news

naga chaitanya latest movie updates director chandu mondeti news : According to the tollywood sources.. Akkineni nagachaitanya has given green signal to work with director chandu mondeti who got huge hit with karthikeya movie.

ఆ దర్శకుల వెంటపడుతున్న నాగచైతన్య..?

Posted: 02/06/2015 10:25 AM IST
Naga chaitanya latest movie updates director chandu mondeti news

అక్కినేని నాగచైతన్య ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి చాలారోజులైనప్పటికీ.. ఇంకా తనకంటూ స్టార్ ఇమేజ్’ని పొందలేకపోయాడు. దాంతో ఇతను తన కెరీర్’ని ఆచితూచి ప్లాన్ చేసుకుంటూ ముందడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తన కెరీర్’కి హెల్ప్ అయ్యే విధంగా మంచి చిత్రాలను తెరకెక్కించే దర్శకుల వెంటపడుతున్నట్లు సమాచారం! ఈమధ్యకాలంలో తమ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన కొత్త దర్శకులతో పనిచేయడానికి నాగచైతన్య ఆసక్తి చూపుతున్నాడు.

‘గుండెజారి గల్లంతయ్యిందే’ డెబ్యూ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో ఈ యంగ్ హీరో ‘ఒక లైలా కోసం’ మూవీ చేసి హిట్ సాధించిన విషయం తెలిసిందే! అలాగే ఇప్పుడు కూడా ‘స్వామిరారా’ అనే సస్పెన్స్ - కామెడీ మూవీని తెరకెక్కించి హిట్ అందుకున్న సుధీర్ వర్మ డైరెక్షన్’లో ఓ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది.

ఇదిలావుండగా.. తాజాగా నాగచైతన్య లిస్టులో మరో కొత్త డైరెక్టర్ చేరినట్లు తెలుస్తోంది. ఇటీవలే ‘కార్తికేయ’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చందుమొండేటితో మూవీ చేసేందుకు చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం! చందు వినిపించిన కథ ఈ యంగ్ హీరోకి నచ్చడంతో అతనితో మూవీ చేసేందుకు ఒప్పుకున్నాడని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. త్వరలోనే ఈ మూవీ సెట్స్’పైకి వెళ్లనుందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naga chaitanya chandu mondeti  karthikeya movie news  tollywood news  

Other Articles