జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన చిత్రం ‘టెంపర్’ ఈనెల 13వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. గతకొన్నాళ్ల నుంచి సరైన విజయం దక్కక తీవ్ర అసంతృప్తిలో వున్న ఎన్టీఆర్, ఆయన అభిమానులు.. ఈ సినిమా విజయం సాధిస్తుందని భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన పూరీ కూడా ఈ మూవీపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఇలా అందరూ ఈ మూవీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటుంటే.. వీరందరికీ భిన్నంగా దర్శకుడు సుకుమార్ మాత్రం అప్పుడే హీటెక్కించే పనిలో నిమగ్నమయ్యాడు. ఇదేంటి..? టెంపర్ మూవీ బృందానికి, సుక్కుకి మధ్య సంబంధం ఏంటి..? అనేగా మీ సందేహం! అయితే క్లారిటీ కోసం మేటర్’లోకి వెళ్లాల్సిందే!
గతంలో ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్’లో ఓ మూవీ తెరకెక్కే అవకాశాలున్నాయని వార్తలు వచ్చిన విషయం విదితమే! అప్పట్లో సుకుమార్ తెరకెక్కించిన ‘నేనొక్కడినే’ మూవీ ఫ్లాప్ కావడంతో ఎన్టీఆర్ అతనితో మూవీ తీసేందుకు డ్రాప్ అయ్యాడని రూమర్లు వచ్చాయి. అయితే.. అలాంటిదేమీ లేదంటూ ఆ గాసిప్స్’ను కొట్టిపారేశారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి తమ సినిమాను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. ఎడతెరిపి లేకుండా ‘టెంపర్’ మూవీకోసం రెగ్యులర్ షూటింగ్’లో పాల్గొన్ని ఎన్టీఆర్.. ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజుల వరకు రెస్ట్ తీసుకోనున్నాడు. ఆ తర్వాతే అతను సుక్కు తెరకెక్కిస్తున్న మూవీ రెగ్యులర్ షూటింగ్’లో పాల్గొనేలా ప్లాన్ చేసుకున్నాడని సమాచారం!
ప్రయోగాత్మక దర్శకుడిగా పేరొందిన సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించడం ఇదే తొలిసారి. రొటీన్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్న ఎన్టీఆర్ కాస్త వెరైటీగా కనిపించాలన్న ఉద్దేశంతో ఈసారి సుకుమార్’తో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ షూటింగ్’ను మార్చి మొదటివారంలో ప్రారంభించడానికి యూనిట్ బృందం సిద్ధంగా వుందని సమాచారం! అంటే.. మార్చి నెల నుంచి సుక్కు-ఎన్టీఆర్ తమ మూవీ షూటింగ్’లో బిజీ కానున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్’ను ఇప్పటివరకు చూడని అవతారంలో చూపించడానికి సుకుమార్ కృషి చేస్తున్నాడు. హీరో క్యారెక్టర్ కోసం సుక్కు చాలా స్టైలిష్’గా డిజైన్ చేసినట్లు యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి.
డిఫరెంట్ స్టైల్’లో సాగే రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్, భోగవల్లి బాపినీడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ తన బాణీలను అందిస్తుండగా.. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్’గా ఫిక్సయ్యింది. ఇప్పటికే దాదాపు ఈ మూవీ ప్రొడక్షన్, స్ర్కిప్ట్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయని సమాచారం! ‘టెంపర్’ మూవీ రిలీజ్ వుంది కాబట్టి.. తమ మూవీ షూటింగ్’ను మార్చి నుంచి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more