Shakeela marriage rumours news social media network

shakeela news, shakeela hot news, shakeela marriage news, shakeela hot photos, shakeela marriage rumours, shakeela direction movie, shakeela latest updates

shakeela marriage rumours news social media network : the sexy star shakeela denies her marriage rumours which are create sensation in social media.

ఆపండెహ్.. ఆలూ లేదు చూలూ లేదు!

Posted: 02/05/2015 04:12 PM IST
Shakeela marriage rumours news social media network

గతకొన్నాళ్ల నుంచి సెక్సీ బ్యూటీ షకీలా పెళ్లి చేసుకుందంటూ మీడియాలో జోరుగా ప్రచారాలు సాగాయి. 28 ఏళ్ల యువకుడితో ఈ అమ్మడు పెళ్లి చేసుకున్నట్లు ఫోటోలు కూడా విడుదలయ్యాయి. దీంతో ఈ వార్తలు నిజమేనని అంతా అనుకున్నారు. పైగా.. షకీలా కూడా ఈ వార్తలపై సైలెంట్’గా వుండటంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇక అంతే! ఈ పెళ్లి వార్తలు మరింత జోరందకున్నాయి. ఈ విషయం అలాఇలా ఎగురుతూ చివరికి షకీలా చెవిన పడింది. దాంతో ఖంగుతిన్న ఈ భామ.. తన పెళ్లి వార్తలపై ఓ క్లారిటీ ఇచ్చింది.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న తన పెళ్లి వార్తలపై షకీలా స్పందిస్తూ.. అదంతా అబద్ధమని కొట్టిపారేసింది. అలాగే తనకు పెళ్లయినట్లుగా విడుదలైన ఫోటోలో వున్న ఆ 28 ఏళ్ల యువకుడు తాను తెరకెక్కిస్తున్న సినిమాలో హీరో అని వివరించింది. తాను డైరెక్ట్ చేస్తూ నటిస్తున్న సినిమాలో అదొక సన్నివేశమని ఈమె స్పష్టం చేసింది. పైగా.. అతడు తనకు తమ్ముడు లాంటివాడని, తనకిప్పుడు పెళ్లి అవసరమేముందని తిరిగి ప్రశ్నిస్తోంది. ఏదైతేనేం.. ఈ పెళ్లి వార్తలతో షకీలా మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్’గా నిలిచిపోయింది.

ఇదిలావుండగా.. షకీలా మొదటిసారిగా దర్శకురాలిగా మెగాఫోన్ పట్టిన విషయం విదితమే! తెలుగు, హిందీ భాషల్లో ఆమె ఓ సినిమాను తెరకెక్కిస్తుంది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు చేసే మృగాళ్ళకు బుద్ధి చెప్పే కథాంశంతో ఉంటుందని, తాను కూడా ఓ చిన్న పాత్రలో నటిస్తున్నట్లు గతంలో షకీలా పేర్కొంది. ఇప్పుడు తాజాగా విడుదలైన ఫోటో కూడా ఆ మూవీలోని ఓ సన్నివేశంలో భాగమేనంటూ చెప్పుకుంటున్నారు. మరోవైపు.. ఈమె అనాథ పిల్లలకు ప్రతీనెల కొంత సాయం చేస్తున్నట్లుగా తెలిపింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shakeela marriage news  telugu movies  tollywood gossips  

Other Articles