Shahrukh khan salman khan aamir khan sexiest khan at 50 survey

shahrukh khan news, salman khan news, aamir khan news, shahrukh salman khan, shahrukh aamir khan, salman aamir khan news, shahrukh khan latest movie news, sexiest khan at 50 survey, shahrukh khan brands

shahrukh khan salman khan aamir khan sexiest Khan at 50 survey : the bollywood king shahrukh khan beats Salman and Aamir, wins the ‘sexiest Khan at 50′ title!

సల్మాన్-అమీర్ లను వెనక్కు నెట్టేసిన షారుఖ్!

Posted: 02/05/2015 01:16 PM IST
Shahrukh khan salman khan aamir khan sexiest khan at 50 survey

చిత్రపరిశ్రమలో హీరోల మధ్య పోటీలు వుండటం సహజమే! ముఖ్యంగా బాలీవుడ్’లో అయితే గతకొన్నాళ్ల నుంచి ఖాన్ త్రయం (షారుఖ్, సల్మాన్, అమీర్)లో నిత్యం కాంపిటీషన్ జరుగుతూనే వుంటుంది. ఒకరి సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూళ్లు చేస్తే.. మరొకరు ఆ రికార్డును బద్దలు కొడుతుంటారు. కేవలం మూవీ విషయాల్లో కాదు.. టీవీ హోస్ట్’గా, బ్రాండ్ అంబాసిడర్’గా, బిజినెస్ పరంగా వీరిమధ్య పోటీ వుంటుంది. అయితే.. వీరిలో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ స్థానమే వేరు! ఇప్పటికే సంపద విషయంలో ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానాన్ని ఆక్రమించి బాలీవుడ్’లో సంచలనం సృష్టించిన ఈ బాద్షా.. అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకుపోతున్నాడు. తనకు తానే సాటి అన్నట్లుగా మిగతా హీరోలను వెనక్కు నెట్టేసి పరుగులు తీస్తున్నాడు. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో భాగంగానూ తన సత్తా చాటుకున్నాడు షారుఖ్!

ఇటీవలే ఓ ప్రముఖ వెబ్’సైట్ వీరి ముగ్గురు పేరిట ఓ పోల్ నిర్వహించింది. 50 సంవత్సరాల వయసుకు దగ్గరపడుతున్న ఈ ముగ్గురు ఖాన్ లలో ‘సెక్సీయెస్ట్ ఖాన్ ఎవరు?’ అంటూ ప్రేక్షకులను ప్రశ్నించింది. ఇందులో భాగంగా వెలువడిన రిజల్ట్ ప్రకారం.. షారుఖ్ ఖాన్ అత్యధిక ఓట్లతో ముందంజలో వున్నాడు. ఈ పోటీలో షారుఖ్ 47% ఓట్లతో మొదటి స్థానంలో వుండగా.. 43% సల్మాన్ రెండో స్థానంలోనూ, కేవలం 10% ఓట్లతో అమీర్ మూడవ స్థానంలో వున్నాడు. ఇటీవలకాలంలో షారుఖ్ ఖాన్ నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రం మంచి వసూళ్లను రాబట్టినా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఆయనకు ఫాలోయింగ్ తగ్గిపోయిందని అంతా అనుకున్నారు. మరోవైపు ‘పీకే’ చిత్రంలో అమీర్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాడు. అలాగే ‘కిక్’ మూవీతో సల్మాన్ తన కెరీర్’లో అత్యధిక కలెక్షన్లనూ సాధించాడు. దీంతో షారుఖ్ ఖాన్ ‘కింగ్’ ఇమేజ్ పడిపోయిందని అంతా అనుకున్నారు.

కానీ.. తాజాగా వెలువడిన సర్వే లెక్కల్లో షారుఖ్ ఖాన్ ముందుంజలో ఉండడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. షారుఖ్ ఖాన్ కెరీర్’లో ఎన్ని ఓటములు వచ్చినా అవి ఆయన్ను ఏమాత్రం దెబ్బతీయలేవని, అతని స్థానం ఇంకా రోజురోజుకు పెరుగుతోందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకేనేమో! షారుఖ్’ని ప్రత్యేకింగ్ బాలీవుడ్ ‘కింగ్’గా అభివర్ణిస్తారని వెల్లడిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shahrukh khan news  aamir khan news  salman khan news  sexiest khan at 50 survey  

Other Articles