Kriti sanon shahrukh khan naga chaitanya movie offers

kriti sanon news, shahrukh khan news, varun dhawan news, naga chaitanya news, director rohit shetty news, shahrukh khan rohit shetty news, kriti sanon hot photos, kriti sanon latest news, kriti sanon shahrukh khan movie, kriti sanon shahrukh, kriti sanon varun dhawan, kriti sanon hot gallery

kriti sanon shahrukh khan naga chaitanya movie offers : the glamorous beauty kriti sanon got a huge offer to act in shahrukh khan movie which will go floors on march.

నాగ్ చెయ్యి పట్టుకుంటే.. షారుఖ్ పిలిచాడు!

Posted: 02/05/2015 12:50 PM IST
Kriti sanon shahrukh khan naga chaitanya movie offers

మహేష్ సరసన ‘నేనొక్కడినే’ లాంటి భారీ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఢిల్లీ బ్యూటీ కృతిసనన్.. ఆ మూవీతో ఆమె కెరీర్ ఓ రేంజికి వెళ్లిపోతుందని అనుకున్నారు. కానీ.. ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డంతో ఆ అంచనాలకు బ్రేక్ పడ్డాయి. అయితే.. గతంలో యాడ్’ల ద్వారా కొంచెం క్రేజ్ సాధించిన నేపథ్యంలో ఈమెకు బాలీవుడ్’లో ఓ ఆఫర్ వచ్చింది. ఆ చిత్రం మంచి విజయం సాధించింది కానీ.. అది ఆమెకు అంతగా అవకాశాలు తెచ్చిపెట్టివ్వలేదు. ఈ సమయంలో నాగ్ ఈమె చేతపట్టుకుని టాలీవుడ్’కి తీసుకొస్తే.. అటునుంచి షారుఖ్ ఖాన్ పలిచిచాడని సమాచారం!

ప్రస్తుతం ఈ పొడుగుకాళ్ల సుందరి నాగచైతన్య సరసన ఓ సస్సెన్స్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే! ఈ మూవీ తర్వాత మరే ఆఫర్లు లేని ఈ అమ్మడికి ఇప్పుడు బాలీవుడ్’లో ఓ బంపరాఫర్ దక్కింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సినిమాలో నటించే సువర్ణవకాశాన్ని ఈ అమ్మడు దక్కించుకుంది. షారుఖ్’తో కలిసి ‘చెన్నయ్ ఎక్స్ ప్రెస్’ మూవీని రూపొందించి, భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు రోహిత్ శెట్టి.. మరోసారి అతనితో జతకడుతున్న విషయం విదితమే! వచ్చే మార్చి నుంచి వీరిద్దరి తాజా మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మూవీలో యువనటుడు వరుణ్ ధావన్ కూడా నటిస్తున్నాడు. అతని సరసనే కథానాయికగా కృతిని ఎంచుకున్నట్లు బాలీవుడ్ సమాచారం!

నిన్నటివరకు ఈమె కెరీర్ గాడిలో పడిపోయిందని భావించిన కృతిసనన్’కు ఇప్పుడు ఏకంగా షారుఖ్ మూవీలో ఆఫర్ రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఈ సినిమా తన కెరీర్’కి పెద్ద మలుపు అవుతుందని సంతోషంగా వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఈ అమ్మడు అక్షయ్ కుమార్ చిత్రంలోనూ నటిస్తోంది. ఈ రెండు సినిమాలు హిట్టయితే.. ఇక ఈమె కూడా స్టార్ హీరోయిన్’గా ఎదిగిపోతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kriti sanon bollywood  shahrukh khan rohit shetty  varun dhawan latest  

Other Articles