Tollywood comedian hero sunil two movies dilraju kona venkat anil sunkara gopi mohan vasu varma

hero sunil, comedian sunil, producer dilraju news, writer kona venkat news, dil raju sunil movie, kona venkat sunil movie, sunil nikki gilrani movie, hero sunil latest news, sunil latest news, sunil movies updates, dil raju movies updates, kona venkat movies updates

tollywood comedian hero sunil two movies dilraju kona venkat anil sunkara gopi mohan vasu varma : telugu comedian turns hero sunil is becoming busy again with two movies which are ready to go on floor soon

సునీల్ కి ముహూర్తం ముంచుకొస్తోందట!

Posted: 02/03/2015 03:33 PM IST
Tollywood comedian hero sunil two movies dilraju kona venkat anil sunkara gopi mohan vasu varma

కమెడియన్ నుంచి హీరోగా అవతారమెత్తిన సునీల్ దశ పూర్తిగా తిరిగిపోయినట్లు కనిపిస్తోంది. ఆమధ్య తన కామెడీ ట్రాక్’తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేసిన సునీల్.. ఆ ప్రేక్షకాదరణే అతనిని హీరోగా ఎదిగే అవకాశం ఇచ్చింది. దీంతో ఇతను హీరోగా నటించిన అల్లరిరాముడు, మర్యాదరామన్న భారీ విజయాలను అందుకున్నాయి. ఆ తర్వాత నటించిన పూలరంగడు చిత్రం కూడా ఓ రేంజ్’లో హిట్ అయింది. కానీ.. తదనంతరం నటించిన మూవీలు బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమవడంతో ఇతనికి అవకాశాలు పూర్తిగా కరువయ్యాయి. ఏ దెబ్బతో డీలా పడిపోయిన ఈ హీరో.. దాదాపు ఏడాది నుంచి ఇండస్ట్రీకి దూరంగా వుంటున్నాడు. అయితే.. ఇప్పుడు ఇతని దశ తిరిగినట్లుంది.

నిన్నటివరకు ఖాళీగా సమయం గడిపిన సునీల్.. ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలను సెట్స్’పైకి తీసుకెళ్లే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ రెండింటిలో ఒక చిత్రాన్ని రూపొందించనున్న ‘జోష్’ మూవీ దర్శకుడు వాసువర్మ ఇప్పటికే స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్నాడని సమాచారం! ఈ చిత్రానికి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండగా.. కోన వెంకట్ కథసహకారం అందిస్తున్నారు. ఇందులో నిక్కి గిల్రాని హీరోయిన్’గా నటించనుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీని త్వరలోనే సెట్స్’పైకి తీసుకెళ్లేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఇక రెండో చిత్రం విషయానికొస్తే.. ప్రముఖ రైటర్ గోపీ మోహన్ డైరెక్షన్’లో వుంటుంది. ఇప్పటికే గోపీ కూడా స్ర్కిప్ట్ వర్క్’ను దాదాపుగా పూర్తి చేశాడట! ఇదే విషయమై గోపీ మాట్లాడుతూ.. ‘‘సునీల్ హీరోగా నా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు నేను-కోన వెంకట్ కలిసి ఓ భిన్నమైన కథను రూపొందించాం. ఏకే ఎంటర్ టైన్’మెంట్ బ్యానర్’లో అనిల్ సుంకర దీనిని నిర్మించనున్నారు. సునీల్ - వాసువర్మ సినిమాతోపాటు ఈ సినిమా షూటింగ్’ని కూడా పార్లర్’గా జరిగేలా ప్లాన్ చేస్తున్నాం. మార్చి చివర్లో లేదా ఏప్రిల్ మొదటి వారాంతంలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుంది’’ అని ఆయన తెలిపారు. ఇలా ఈ రెండు మూవీలతో సునీల్ మళ్లీ బిజీ కానున్నాడమన్నమాట!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hero sunil movie news  producer dil raju  kona venkat news  

Other Articles