Shruti sodhi next movie hero adi director veera bhadram

shruti sodhi news, shruti sodhi pataas movie, shruti sodhi hot photos, shruti sodhi bikini news, shruti sodhi pataas movie news, shruti sodhi hero adi, shruti sodhi adi hot scenes, shruti sodhi latest movies, shruti sodhi updates, hero adi news, hero adi movies, hero adi photos, director veera bhadram news, producer anil sunkara news

shruti sodhi next movie hero adi director veera bhadram : According to the tollywood sources.. the pataas movie actress shruti sodhi go chance another movie with adi which is directed by veera bhadram.

మరో ‘పటాస్’ పేల్చడానికి జర్నలిస్ట్ రెడీ!

Posted: 02/03/2015 03:05 PM IST
Shruti sodhi next movie hero adi director veera bhadram

జర్నలిజంతో తన కెరీర్’ని మొదలుపెట్టిన పంజాబీ సెక్సీ తార శృతి సోది.. తన మాతృభాషలో మూడు సినిమాలు చేసిన అనంతరం టాలీవుడ్’లో వాలిన సంగతి తెలిసిందే! కళ్యాణ్ రామ్ సరసన ఈమె నటించిన ‘పటాస్’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి, అనూహ్య విజయం సాధించింది. చాలాకాలం తర్వాత కళ్యాణ్’కు భారీ హిట్ అందించి అతనిని సంతోషపరిస్తే.. ఇటు శృతిసోది కెరీర్’కి ఈ మూవీ బాగా హెల్ప్ అయినట్లు వుంది. నిజానికి ఆ మూవీలో శృతి పాత్ర చాలా చిన్నదే అయినప్పటికీ, అందచందాలతోపాటు, తన నటనతో ప్రేక్షకులకు మెస్మరైజ్ చేసింది. పైగా.. ఈమధ్యే బికినీ వేసుకోవడానికి రెడీ అంటూ బహిరంగంగా చెప్పడంతో ఈమెకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నట్లు సమాచారం!

ఇప్పటికే ‘పటాస్’ చిత్రంతో టాలీవుడ్’లో తన సత్తా చాటిన ఈ అమ్మడు.. మరో మూవీతో బాంబు పేల్చేందుకు సిద్ధమవుతోందని ఇండస్ట్రీవర్గాలు పేర్కొంటున్నాయి. ‘భాయ్’ మూవీని తెరెక్కించిన వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో ఆది హీరోగా ఓ మూవీ తెరకెక్కనుంది. దీనిని అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్నారు. ఈ సినిమాలోనే హీరోయిన్ పాత్రకోసం శృతిని సంప్రదించినట్లు తెలుస్తోంది. తమ మూవీ కథను కూడా ఆమెకు వినిపించారట! అయితే.. మూవీలో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో..? లేదో..? ఇంకా తెలియాల్సి వుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే.. త్వరలోనే మూవీ షూటింగ్ ప్రారంభించే అవకాశం వుంది.

నిజానికి ఈ మూవీకి సంబంధించిన వార్తలు గతంలో ఓసారి వచ్చాయి. అయితే.. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తలెత్తడం వల్ల మళ్లీ ఆ మూవీ ప్రస్తావన బయటకు రాలేదు. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ కాస్త సద్దుమణగడంతో తిరిగి షూటింగ్ ప్రారంభించేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కథానాయికగా శృతిని సంప్రదించారని తెలిసింది. ఏదైతేనేం.. శృతి మరో పటాస్ పేల్చేందుకు సిద్ధమవుతోందన్నమాట!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shruti sodhi movie updates  telugu hero adi news  tollywood gossips  

Other Articles