Tamanna bhatia multistarrer movies actresses bahubali

tamanna bhatia, tamanna bhatia news, tamanna bhatia interview, tamanna bhatia hot photos, tamanna bhatia gallery, tamanna bhatia sexy curves, tamanna bhatia photo session, tamanna hot photo shoot, tamanna sexy photos, telugu heroines, multi starrer movies, tollywood news

tamanna bhatia multistarrer movies actresses bahubali : tamanna bhatia speaks about actresses multi starrer movie. She told that if actresses are doing multistarrer movie then it will benefit for movie.

ఇద్దరు కలిసి చేయడంలో తప్పేముంది..?

Posted: 01/29/2015 03:13 PM IST
Tamanna bhatia multistarrer movies actresses bahubali

ఈమధ్య ఇండస్ట్రీలో మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇద్దరు హీరోలు కలిసి నటిస్తున్నారు కాబట్టి.. ఆయా హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ ఆ సినిమాలను చూసేందుకు ఎగిసిపడుతున్నారు. దీంతో మల్టీస్టారర్ చిత్రాలకు ఎక్కడేలని క్రేజ్ వచ్చిపడుతోంది. అందుకే.. హీరోలందరూ పరస్పరం చర్చించుకుని మల్టీస్టారర్ మూవీల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అయితే.. ఈ మల్టీస్టారర్ వ్యవహారం మాత్రం కేవలం హీరోలకే చెల్లుతుంది. అదే ఇద్దరు హీరోయిన్లు కలిసి ఒకే మూవీలో నటిస్తే.. దానికి క్రేజ్ రాకపోగా నిర్మాతలకు ఖర్చు తడిసిమోపెడైపోతుంది. పైగా.. ఇద్దరు తారలు కలిసి ఒకే చిత్రంలో నటిస్తున్నారంటే అందరూ ‘అవునా..!’ అనే ఆశ్చర్యాన్నే వ్యక్తం చేస్తారు. ఇదీ టాలీవుడ్’లో వున్న పరిస్థితి!

ఇదే విషయమై తమన్నాను ప్రశ్నించగా.. మల్టీస్టారర్ అనేది కేవలం హీరోలకు మాత్రమేనా..? హీరోయిన్స్’కి సౌలభ్యం లేదా..? అని తిరిగి ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ.. ‘‘ఒకే సినిమాలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తే.. అందులో తప్పేముంది. అయినా.. దర్శకుడు ఏం చేసినా సినిమా కోసమే కదా! అలాంటప్పుడు నటించేందుకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నేను చూసేది మాత్రం కథలో నా పాత్రకు ప్రాధాన్యం వుందా..? లేదా..? అంతే! ఇంకా చెప్పాలి అంటే.. ఇతర తారలతో కలిసి నటిస్తున్నప్పుడు నటనలో వారితో పోటీపడాలని అనిపిస్తుంది. దానివల్ల మాకు, సినిమాకే మంచి జరుగుతుంది కందా!’’ అంటూ స్పష్టం చేసింది.

తమన్నా ఇప్పటికే మల్టీ హీరోయిన్స్ వున్న సినిమాల్లో నటించింది. ఆ అనుభవంతోనే ఈ అమ్మడు ఇతర తారలతో కలిసి నటించడంలో ఇంకా మేలు జరుగుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇదిలావుండగా.. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రతిష్టాత్మకమైన ‘బాహుబలి’ చిత్రంలో నటిస్తోంది. అలాగే తెలుగు, తమిళంలో రెండేసి సినిమాల్లో చర్చల్లో వున్నాయని సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamanna bhatia  multi starrer movies  tollywood news  

Other Articles