Nagarjuna karthi movie shooting dubai schedule shruti hassan pvp banner

nagarjuna latest news, nagarjuna karthi movie news, nagarjuna karthi multistarrer news, nagarjuna karthi movie, shruti hassan news, shruti hassan hot photos, shruti hassan gallery, nagarjuna dubai home, nagarjuna dubai shooting, shruti hassan romantic scenes

nagarjuna karthi movie shooting dubai schedule shruti hassan pvp banner : nagarjuna and karthi multistarrer movie unit members searching for big bunglow in dubai for shooting.

దుబాయ్’లో బంగళాకోసం నాగార్జున తిప్పలు...

Posted: 01/22/2015 11:10 AM IST
Nagarjuna karthi movie shooting dubai schedule shruti hassan pvp banner

టాలీవుడ్ మన్మథుడిగా పేరొందిన అక్కినేని నాగార్జున.. దుబాయ్’లో ఓ ప్రత్యేకమైన బంగళాకోసం చక్కర్లు కొడుతున్నారు. కొన్నిరోజుల నుంచి మొదలుపెట్టిన ఈ వేటలో ఇంతవరకు తనకు నచ్చిన బంగళా దొరకకపోవడంతో కాస్త ఆందోళనలో మునిగిపోయారు. అయినప్పటికీ అత్యంత అవసరం కాబట్టి.. ఇళ్లు దొరికేవరకు వేటను కొనసాగిస్తూనే వున్నారని సమాచారం! ఈ వేటలో ఆయనకు మరికొందరు కూడా సహాయం అందిస్తున్నారు. అసలు.. అంత అవసరం ఏమొచ్చిందా..? అని అనుకుంటున్నారా! అయితే మేటర్’లోకి వెళ్లాల్సిందే!

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున-కార్తీ హీరోలుగా తెలుగు, తమిళ భాషల్లో మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్’ని ఏప్రిల్ నెలలో ప్రారంభిస్తారు. ఈ మూవీ చిత్రీకరణ ఎక్కువ భాగం దుబాయ్’లోనే జరుగుతుందని సమాచారం! అందుకే.. ఈ షూటింగ్’కోసం అక్కడ కొన్నాళ్లు వుండేందుకు ఓ పెద్ద బంగళా అవసరం అవుతుంది కాబట్టి.. దాని వేటలో అందరూ నిమగ్నమైపోయారు. గతకొన్నిరోజుల నుంచి బంగళా కోసం అన్వేషణ ప్రారంభించినప్పటికీ.. తమకు తగ్గట్టు దొరకకపోవడంతో ఇంకా పెద్ద బంగళా కోసం వెతుకుతూనే వున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దుబాయ్’లో నాగ్, కార్తీల మధ్య కొన్ని కీలక సన్నివేశాలతోపాటు కొన్ని రొమాంటిక్ సీన్లను తెరకెక్కిస్తున్నారు.

ఇదిలావుండగా.. ఈ మూవీ ఫ్రెంచ్ హిట్ మూవీ అయిన ‘ద ఇన్’టచబుల్స్’ ఆధారంగా నిర్మిస్తున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారాలు సాగుతున్న విషయం తెలిసిందే! ఆ మూవీలో భాగంగా నాగార్జున పేషెంటుగానూ, ఆయనకు సేవలు మేల్ నర్సుగా కార్తీ నటించనున్నారని సమాచారం! అయితే.. ఈ విషయం ఇంకా అధికారికంగా వెలువడి కాలేదు. ఇక శృతి హీరోయిన్’గా నటిస్తున్న ఈ మూవీని పీవీపీ బ్యానర్’పై పొట్లూరి ప్రసాద్ నిర్మిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles