Rana daggubati bahubali movie secret director rajamouli tollywood news

rana daggubati news, bahubali movie news, director rajamouli news, prabhas news, anushka shetty news, tamanna bhatia news, rana daggubati interview, rana daggubati press meet, rana daggubati facebook, rana daggubati twitter, rana bahubali movie, prabhas twitter, prabhas facebook, tamanna bhatia hot photo shoot, anushka shetty hot photos

rana daggubati bahubali movie secret director rajamouli tollywood news : the macho man rana daggubati has revealed a secret of bahubali movie. It as a periodic movie which is directed by ace director rajamouli.

అమ్మ జక్కన్న.. రానాతో సీక్రెట్ రివీల్ చేయిస్తావా ?

Posted: 01/22/2015 10:36 AM IST
Rana daggubati bahubali movie secret director rajamouli tollywood news

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ చిత్రానికి సంబంధించి ఓ అరుదైన సీక్రెట్’ను రానా రివీల్ చేశాడు. ఇన్నాళ్లూ గోప్యంగా దాచుతూ వచ్చిన ఆ మూవీ వివరాలను చివరికీ ఈ ఆరడుగుల బుల్లెట్ బహిర్గతం చేశాడు. అందరూ అనుకున్నట్లుగా ఈ మూవీ వుండదని, ఊహించిన దానికంటే పూర్తి భిన్నంగా వుంటుందని పేర్కొన్న రానా.. ఇందులో వున్న అసలు విషయాన్ని పేర్కొన్నాడు. అదేమిటో తెలుసుకోవాలనుందా..? అయితే మేటర్’లోకి వెళ్లాల్సిందే!

ఇప్పటివరకు ఈ మూవీకి సంబంధించి విడుదలైన ఫస్ట్’లుక్ పోస్టర్లు, మేకింగ్ వీడియోలను చూసి.. ఈ చిత్రం రామాయణం, మహాభారతంలోని కొన్ని పాత్రలను స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కిస్తున్నారేమోనని అనుకున్నారు. అలాగే చరిత్రలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా.. ఒక రాజ్యం కోసం జరిగిన సాహస యుద్ధగాధను చిత్రీకరిస్తున్నట్లుగా చెప్పుకున్నారు. పైగా.. నటీనటుల క్యారెక్టర్ల పేర్లను చరిత్రలో తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నవారి యోధులు, రాజుల, రాజ్యాల మీదే వుండటంతో.. ఈ మూవీకి హిస్టారికల్ కనెక్ట్ ఖచ్చితంగా వుంటుందనే భావనలను ఇండస్ట్రీ వ్యక్తం చేస్తోంది.

కానీ.. ఇందులో విలన్ క్యారెక్టర్ పోషిస్తున్న రానా దగ్గుబాటి మాత్రం ఆ పుకార్లను కొట్టిపారేశాడు. అసలు ఈ మూవీకి చరిత్రతో ఎటువంటి సంబంధం లేదని అతగాడు తేల్చి చెప్పేశాడు. ‘‘బాహుబలి ఓ పిరియాడిక్ మూవీ మాత్రమే! దేశచరిత్రలో మధ్యయుగ యుద్ధాలు ఎలా జరిగాయో ప్రపంచానికి తెలియజేయడం కోసం మాత్రమే దీన్ని తెరకెక్కించడం జరుగుతోంది. అంతేగానీ.. ఇది ఏ రాజ్యానికో లేదా రాజుకో సంబంధించిన హిస్టారికల్ మూవీ అయితే కాదు. ఇది కల్పిత కథ మాత్రమే’’ అని ఈ చిత్రానికి సంబంధించిన అరుదైన సీక్రెట్’ను రివీల్ చేశాడు. మరి.. తన మూవీ విషయాలను రిలీజ్ అయ్యేంతవరకు గోప్యంగా వుంచే జక్కన్న.. ఇప్పుడు రానాతో ఎందుకు రివీల్ చేయించినట్టో!

ఇదిలావుండగా.. ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా దగ్గుబాటు లీడింగ్ పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే! వీరితోబాటు నాజర్, రమ్యక్రిష్ణలతో ఇతర నటీనటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక రానా పాత్ర విషయానికొస్తే.. అతను ఇందులో బల్లదేవ అనే విలన్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే! ప్రస్తుతం షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ మూవీని వచ్చే వేసవి సెలవుల్లో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. భారీ బడ్జెట్టుతో నిర్మించిన ఈ చిత్రం క్రేజ్’ను పెంచేందుకు యూనిట్ బృందం రోజుకో వార్తతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి బాగానే ప్లాన్’లు వేస్తోంది. ఇప్పుడు రానాతో కూడా ఆ ప్రమోషన్’లో చేరిపోయినట్లు తెలుస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rana daggubati news  bahubali movie news  director rajamouli news  

Other Articles