Hansika motwani twitter followers reach 1 million after sruthi hassan samantha trisha

hansika motwani news, hansika motwani twitter, hansika motwani hot photos, hansika motwani twitter followers, hansika motwani cleavage show, hansika liplock scenes, hansika hot videos, trisha krishnan twitter, samantha ruth prabhu twitter, shruti hassan twitter

hansika motwani twitter followers reach 1 million after sruthi hassan samantha trisha : hansika motwani is the first 90's actress to reach 1 million followers in twitter after the star senior heroines sruthi hassan, samantha ruth prabhu and trisha krishnan

హన్సిక ‘పిట్ట’ ముందు డీలా పడిపోయిన తారలు..

Posted: 01/21/2015 11:46 AM IST
Hansika motwani twitter followers reach 1 million after sruthi hassan samantha trisha

ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి చాలాకాలమే అయినప్పటికీ.. హన్సికకు మాత్రం ఇంతవరకు స్టార్ ఇమేజ్ దక్కలేదు. నటిగా తనను తాను గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న సమంత, శృతి, త్రిషలకు ధీటుగా పోటీ ఇవ్వలేకపోతోంది. అయినా.. ఈ అమ్మడి చేతిలో బోలెడన్ని సినిమాలున్నాయి. తమిళ, తెలుగుతోబాటు ఇతర భాషల్లోనూ దాదాపు డజనుకుపైగా మూవీలతో ఫుల్ బిజీగా వుంది! బహుశా ఈ చిత్రాల ద్వారానైనా ఈ భామకు స్టార్’డమ్ వస్తుందో, లేదో వేచి చూడాలి!

ఇదిలావుండగా.. ఈ బొద్దుగుమ్మకు ఇండస్ట్రీలో అంతగా స్టార్ ఇమేజ్ లేకపోయినా తన పిట్ట ద్వారా మాత్రం ఆ స్టార్ హీరోయిన్లకు ధీటుగానే పోటీ ఇస్తోందని తేలిపోయింది. ఇక్కడ పిట్ట అంటే ట్విటర్! శృతి, త్రిష, సమంతలకు ఈ ట్విటర్’లో 10 లక్షలమందికిపైగా ఫాలోవర్స్ వున్నారు. ఇప్పుడు తాజాగా హన్సిక కూడా 1 మిలియన్ ఫాలోవర్లతో వీరి మధ్య చేరిపోయింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. త్రిష, శృతి, సమంత 80వ దశకానికి చెందినవారు కాగా హన్సిక ఒక్కతే 90వ దశకానికి చెందింది.

అంటే.. స్టార్ ఇమేజ్ లేకపోయినా ఈ అమ్మడు తన సెక్సీ-గ్లామరస్ లుక్స్’తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సీనియర్ తారలను వెనక్కునెట్టేసిందన్నమాట! ఇది ఇలాగే కొనసాగితే.. త్వరలోనే ఈ బొద్దుగుమ్మ స్టార్ హీరోయిన్’గా అవతారమెత్తే అవకాశాలున్నాయని సినీ విశ్లేషకుల అభిప్రాయం! ఏదైతేనేం.. ఫాలోవర్లును బాగానే పొగేసుకుందని అంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles