Anegan movie telugu title anekudu

Anegan movie, Anegan movie updates, Anekudu movie latest, Anekudu movie release date, Anekudu movie updates, Anekudu wallpapers, Anekudu movie cast and crew, Dhanush movie, Dhanush, tollywood updates, upcoming telugu movies

Anegan movie telugu title Anekudu : Hero Dhanush lead played Anegan movie also relasing in telugu with anegan title. Anegan movie shooting going on and release in summer. Dhanush got craze after his super hit movie Raghuvaran B.tech.

తెలుగులో రఘు కు పెరిగిన డిమాండ్

Posted: 01/17/2015 01:52 PM IST
Anegan movie telugu title anekudu

‘వై దిస్ కొలవరి’ పాటతో దేశాన్ని ఊపేసిన రజినీకాంత్ అల్లుడు ధనుష్ తాజాగా ‘వీఐపీ’ సినిమాతో మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. తెలుగులో ‘రఘువరన్ బీ.టెక్’ పేరుతో విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. స్రవంతి రవికిషోర్ విడుదల చేసిన ఈ మూవీకి ఇంకా డిమాండ్ ఉంది. ఇన్నాళ్ళు తమిళంలో పాపులర్ అయిన ధనుష్ తాజా సినిమాతో తెలుగులో కూడా క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో ఈయన సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సిద్ధం అవుతున్నారు.

ధనుష్ ప్రస్తుతం ‘అనేగన్’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కతోంది. ‘రంగం’ సినిమాతో దర్శకుడిగా మారిన కే.వి. ఆనంద్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.., ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ‘అనేకుడు’ పేరుతో కల్పతి అగోరమ్ బ్యానర్ సినిమాను విడుదల చేయనుంది. రఘువరన్ హిట్ నేపథ్యంలో ‘అనేకుడు’కు ఆశించిన కలెక్షన్లు వస్తాయని మూవీ యూనిట్ భావిస్తోంది. సినిమా విషయానికి వస్తే.., కల్పాతి అగోరమ్, కల్పాతి గణేష్, కల్పాతి సురేష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హేరిస్ జై రాజ్ సంగీతం అందిస్తుండగా ఓం ప్రకాష్ సినిమాటోగ్రాపర్ గా వ్యవహరిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anekudu movie  dhanush  Anegan movie updates  

Other Articles