I movie collections updates

I movie, I telugu movie, I Manoharudu movie collections, I manoharudu movie updates, I movie latest updates, I movie public response, I movie public talk, I Manoharudu wallpapers, tollywood updates, Tollywood Upcoming movies

I movie collections updates : shankar latest movie I going with mixture talk in industry. I telugu unit saying that movie gaining good collections from two telugu states. NV Prasad feels happy with public response for I movie

‘ఐ’నా అది ఎలా సాధ్యం...?

Posted: 01/17/2015 02:46 PM IST
I movie collections updates

సంక్రాంతి కానుకగా వచ్చిన శంకర్ సినిమా ‘ఐ’ ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన పొందుతోంది. సినిమా బాగుందని కొందరు చెప్తుంటే, భరించలేకపోతున్నాం అని మరికొందరు అంటున్నారు. ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్లను పరిశీలిస్తే ఆశించినంతగా లేవు అని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే మూవీ యూనిట్ మాత్రం ఇందుకు భిన్నంగా ప్రకటనలు చేస్తోంది. అన్ని చోట్ల సినిమాకు మంచి స్పందన వస్తోందని తెలుగు వర్షన్ నిర్మాత ఎన్వీ ప్రసాద్ చెప్పారు. గతంలో ఎప్పుడూ లేని విధ:గా కలెక్షన్లు వసూలు చేస్త్తోందన్నారు. కలెక్షన్లలో కూడా రికార్డులు క్రియేట్ చేస్తోందన్నారు.

సినిమాలో విక్రమ్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారని మూవీ యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. మరోవైపు శంకర్ మార్కు విజువల్ ఎఫెక్టులను చూసి సంబరపడుతున్నారని చెప్పారు. ఇదంతా సినిమా యూనిట్ వర్షన్ అయితే.., అసలు సంగతి మరోలా ఉంది. ‘ఐ మనోహరుడు’కు ఊహించిన స్పందన రావటం లేదని స్పష్టం అవుతోంది. మూవీ ఆవరేజ్ అని టాక్ తెచ్చుకోవటంతో కలెక్షన్లు కూడా మామూలుగానే వసూలవుతున్నట్లు తెలుస్తోంది. కేవలం యాక్టింగ్, ఎఫెక్టుల కోసమే ఈ మూవీ చూడవచ్చు అని సింపుల్ గా జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. మరి ఇలాంటి సినిమాకు భారీ కలెక్షన్లు ఎలా సాధ్యమో చెప్పేవారికే తెలియాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : I movie  tollywood updates  i movie collections  

Other Articles