Balakrishna lion release date

nandamuri balakrishna, balakrishna, balakrishna latest news, balakrishna movies, balakrishna photos, balakrishna bandipotu movie, balakrishna forth comming 98th movie, balakrishna movie collections, balakrishna latest updates, balakrishna movie news, balakrishna cinema News, balakrishna upcomming movies, balakrishna new look, balakrishna lion release date, lion movie release date

balakrishna dual role movie lion release date

బాలయ్య ‘లయన్’ విడుదల తేదీ ఖరారు..!

Posted: 01/16/2015 05:06 PM IST
Balakrishna lion release date

లెజెండ్ చిత్రం అందించిన విజయం నందమూరి బాలయ్యకు తిరుగులేని క్రెడిట్ అందించింది. ఇప్పటికే ఈ చిత్రం 275 రోజులను పూర్తి చేసుకుని ప్రేక్షకులను అలరిస్తుండగా, బాలయ్య బాబు నటిస్తున్న తాజా చిత్రం శరవేగంగా షూటింగ్ ఏర్పాట్లను జరుపుకుంటుంది. సత్యదేవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలయ్య 98వ చిత్రం లయన్ షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుని త్వరలోనే పోస్ట్ ప్రోడక్షన్ వైపు వెళ్లేందుకు సిద్దమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన కీలక ఘట్టాలను చిత్ర యూనిట్ షూటింగ్ చే్స్తుంది. దీంతో ఈ నెలాఖరు నాటికి సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకోనుంది.

ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ద్వారా క్రేజ్ పెంచిన బాలయ్య, ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సిబిఐ ఆఫీసర్ గా, సామాన్యుడిగా రెండు విభిన్నమైన పాత్రలను పోషించనున్నారు. ప్రస్తుతం బాలయ్య సిబిఐ ఆఫీసర్‌గా నటిస్తున్న పాత్రకు సంబంధించి పలు యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. బాలయ్య సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 28న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని మణిశర్మ సమకూరుస్తుండగా, ఆడియో విడుదలను ఫిబ్రవరి రెండో వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మాత. సార్వత్రిక ఎన్నికల తర్వాత బాలయ్య నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడం.. లుక్ తో మంచి రెస్పాన్స్ రావడం కూడా బాలయ్యకు చిత్రం పట్ల క్రేజ్ పెంచుతోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna  lion movie release  balakrishna latest updates  

Other Articles