Nara rohith s asura movie first look

Nara Rohith's Asura movie, Asura movie first look, Asura movie latest updates, Asura movie wallpapers, Asura movie cast and crew, Nara Rohith updates, Nara Rohith upcoming movies, tollywood updates, Upcoming Telugu Movies

Nara Rohith's Asura movie first look : different movies hero Nara Rohith latest flick Asura picturising in beautiful locations. Asura first look teaser got good response from all sides

రౌడి లుక్ తో రాక్షసుడి పేరు

Posted: 01/14/2015 10:50 AM IST
Nara rohith s asura movie first look


మొదటి నుంచీ డిఫరెంట్ సినిమాలతో ఆడియన్స్ ను అలరిస్తున్న నారా రోహిత్ త్వరలోనే  మరో వైవిధ్యభరితమైన కథతో వస్తున్నాడు. ‘రౌడిఫెల్లో’ సక్సెస్ తర్వాత ఈ హీరో ‘అసుర’ అనే మూవీలోనటిస్తున్నాడు. విజయ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో ‘జోరు’ ఫేం ప్రియా బెనర్జీ హీరోయిన్ గా నటిస్తోంది. గత సినిమాలాగే యాక్షన్ థ్రిల్లర కాన్సెప్టుతో ఈ మూవీ తెరకెక్కుతోంది. సంక్రాంతి కానుకగా సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయింది.

పూర్తి స్థాయి యాక్షన్ మూవీలా కన్పిస్తున్న మూవీ టీజర్.., టైటిల్స్, లోగో కూడా డిఫరెంటుగా ఉన్నాయి. సాయి కార్తీక్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా శ్యామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టాకీపార్ట్ టింగ్ పూర్తి కాగా.., పాటల షూటింగ్ మిగిలి ఉందని మూవీ యూనిట్ తెలిపింది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో రోహిత్ ను కొత్తగా చూపిస్తామని ‘అసుర’ టీం చెప్తోంది. ఆ కొత్తదనం ఏమిటో సినిమా విడుదలైతేనే తెలుస్తుంది కానీ.., ముందైతే ఈ టీజర్ చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Rohith  Asura movie  Tollywood Updates  

Other Articles