Deepa sannidhi responds on siddarth samantha breakup

Deepa Sannidhi, Deepa Sannidhi with Siddarth, Deepa Sannidhi Siddarth affair, Deepa Sannidhi Siddarth love, Deepa Sannidhi breakup Samantha, Samantha Siddarth breakup reason, Deepa Sannidhi reason for Siddarth samantha love breakup, Deepa Sannidhi movies, Samantha on Siddarth, Samantha on breakup, tollywood updates, kollywood latest

Deepa Sannidhi says she not involved in Siddarth Breakup : After huge allegations on her about Siddarth love breakup Deepa gives clarity that she not maintains any relation with her. relation between me and Siddarth is totally professional not involved in Samantha breakup

ప్లీజ్ ఆపండి... నేను ఆ పాపం చేయలేదు

Posted: 01/14/2015 09:08 AM IST
Deepa sannidhi responds on siddarth samantha breakup

ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న దీపా సన్నిధి తాజాగా తనపై వస్తున్న ఆరోపణల పట్ల కలత చెందుతోంది. ఎవరు ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారో తెలియక చాలా బాధపడుతోంది. సిద్దార్థ్ సమంతను విడిదీశానని వస్తున్న విమర్శలపై చివరకు దీప వివరణ ఇచ్చింది. ‘కొద్దిరోజులుగా బెంగళూరులో ఉన్న నాకు ఈ విషయం తెలియటంతో షాక్ అయ్యాను. ఎవరో ఏదో ఊహించుకుని దానికి కాస్త మసాలా జోడించి ఇంకేదో పుకార్లు పుట్టిస్తున్నారు. సిద్ధార్థ్ తో నా రిలేషన్ కేవలం ప్రొఫెషనల్ మాత్రమే. షూటింగ్ పూర్తయ్యాక సిధ్ధుతో కాంటాక్ట్ లో కూడా లేను’ అని వివరణ ఇచ్చింది.

సిద్దార్థ్ - సమంత లవ్ బ్రేకప్ కావటానికి దీపా సన్నిధి కారణం అని కొద్దిరోజులుగా పుకార్లు వస్తున్నాయి. ‘ఎన్నాకుల్  ఒరువన్’ సినిమాలో లవర్ బాయ్ తో కలిసి నటించిన దీపా.., షూటింగ్ సమయంలో సన్నిహితంగా మెలిగినట్లు సమంతకు తెలిసిందట. ఈ విషయంపై సిద్దును చెన్నై భామ ప్రశ్నించటం.., ఆ తర్వాత ఇద్దరి మద్య మనస్పర్థలు రావటం జరిగాయని కోలీవుడ్ లో టాక్ విన్పిస్తోంది. అయితే దీనిపై విడిపోయిన జంటలో ఎవరూ స్పందించలేదు.

మరోవైపు సిద్దుతో విడిపోయిన వ్యవహారంపై మీడియా అతిగా స్పందిస్తోందని సమంత కోపగించుకుంటోంది. వ్యక్తిగత విషయాల్లోకి మరీ తొంగిచూడటం బాగోదని చెప్తోంది. సిద్దార్థ్ తో రిలేషన్ బ్రేకప్ అయినా ఇద్దరూ కలిసి త్వరలో తెరకెక్కే ‘బ్యాంగ్ ళూర్ డేస్’ రీమేక్ లో నటిస్తారని మూవీ యూనిట్ ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Deepa Sannidhi  Siddarth  Samantha  

Other Articles