Kamal hassan uttama villain movie trailer release

uttama villain trailer, kamal hassan uttama villain trailer, kamal hassan movies, kamal hassan latest news, kamal hassan movie list, uttama villain teaser, uttama villain first look, uttama villain first look trailer, kamal hassan biography

kamal hassan uttama villain movie trailer release : finally the great actor uttama villain movie trailer has released.

ట్రైలర్ : కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన ‘విలన్’...

Posted: 01/13/2015 11:51 AM IST
Kamal hassan uttama villain movie trailer release

లోకనాయకుడు కమల్ హాసన్ ‘విశ్వరూపం’ చిత్రం తర్వాత వరుసగా ‘విశ్వరూపం-2’, దృశ్యం తమిళ రీమేక్, ‘ఉత్తమ విలన్’ వంటి చిత్రాలతో బిజీగా వున్న విషయం తెలిసిందే! ఒకేసారి ఈ మూడు భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా వున్న కమల్.. ‘ఉత్తమ విలన్’ మూవీ షూటింగ్’ని మాత్రం శరవేగంగా కంప్లీట్ చేసుకునే పనిలో మునిగిపోయాడు. నిజానికి ఈ చిత్రం షూటింగ్ మొదలై చాలారోజులే అయ్యింది కానీ.. క్యాస్టింగ్, మేకప్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించడంతో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి.

ఇదిలావుండగా.. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇదివరకే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్’లుక్, టీజర్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. అయితే.. తాజాగా వచ్చిన ఈ ట్రైలర్’ను చూస్తుంటే.. కాస్త భిన్నంగా వున్నట్లు కనిపిస్తోంది. స్టోరీలైన్ ఏమాత్రం తెలియకుండా వుండేలా వున్న ఈ ట్రైలర్.. మొదటినుంచి చివరి వరకు మొత్తం కన్ఫ్యూజన్’గా వుంది.

ఇందులో కమల్ డ్యుయల్ రోల్ పోషిస్తున్నాడా..? లేదా..? అన్న అనుమానంతోపాటు అసలు విలన్ ఎవరు అన్నది అంతుపట్టడం లేదు. ప్రాచీన కథాచిత్రం బ్యాక్’డ్రాప్’తోబాటు ప్రస్తుత పరిణామాలను చూపింపిన ఆ ట్రైలర్ మొత్తం కొత్తగా వుంది. దీన్ని చూస్తుంటే.. కమల్ మరో ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది. మరి.. దీన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేస్తారో రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kamal hassan  uttama villain movie  kollywood news  telugu news  

Other Articles