Pawan kalyan latest movie director kishore parthasani dolly official script works

pawan kalyan latest news, pawan kalyan gopala gopala, pawan kalyan director dolly, gopala gopala movie collections, kishore parthasani interview, gopala gopala movie director, pawan kalyan gabbar singh 2 movie news

pawan kalyan latest movie director kishore parthasani dolly official script works : director kishore parthasani finally annouced that he is preparing a movie script for pawan kalyan.

మాట నిలబెట్టుకున్న పవర్ స్టార్..!

Posted: 01/13/2015 11:08 AM IST
Pawan kalyan latest movie director kishore parthasani dolly official script works

ఇండస్ట్రీలో సెన్సిటివ్ హీరోలుగా పేరొందిన వారిలో పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఒకరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తాను ఏ స్థాయిలో వున్నానన్న విషయాన్ని పక్కనపెట్టి.. నలుగురితో కలిసికట్టుగా అందరితో మమేకమై వుండే వ్యక్తిత్వం ఆయనది. చిత్రపరిశ్రమలో తనకంటూ సుస్థిర స్థానాన్ని పదిలపర్చుకున్న ఈయన.. అందరి మనసుల్లోనూ ఓ మంచి వ్యక్తిగా స్థానాన్ని ఏర్పచుకున్నాడు. నానాటికి అందనంత ఎత్తుకు ఎదిగినప్పటికీ.. తన వ్యక్తిత్వంలో ఎటువంటి మార్పులు రానివ్వకుండా అదే మంచి మనస్తత్వంతో తన నైజాన్ని చాటుకుంటున్న పవర్ స్టార్.. మరోసారి తానిచ్చిన మాటకు కట్టుబడి వుంటాడని నిరూపించుకున్నాడు.

‘గోపాలా గోపాలా’ మూవీ ఆడియో ఫంక్షన్ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తన తదుపరి చిత్రం ఆ మూవీని తెరకెక్కించిన కిషోర్ పార్థసాని (డాలీ) దర్శకత్వంలోనే వుంటుందని పేర్కొన్న విషయం తెలిసిందే! ఆ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘గబ్బర్ సింగ్-2 తర్వాత డాలీ దర్శకత్వంలో వుంటుంది’ అని అన్నారు. అంతేకాదు.. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో భాగంగా అధికారికంగా తన నెక్ట్స్ మూవీ డాలీతోనే వుంటుందని మాటిచ్చారు కూడా! ఇప్పుడు తానిచ్చిన ఆ మాటకు కట్టుబడి వుండి డాలీకి ఆఫర్ ఇచ్చాడు పవన్! అప్పుడే ఆ మూవీకి సంబంధించి స్ర్కిప్టును కూడీ రెడీ చేయాల్సిందిగా పవన్ చెప్పినట్లు టాక్ నడుస్తోంది.

మరోవైపు దర్శకుడు డాలీ తన తాజా చిత్రం ‘గోపాలా గోపాలా’ సక్సెస్ పొందడంతోబాటు కలెక్షన్లను కూడా భారీగా వసూలు చేయడంతో ఫుల్ హ్యాపీగా వున్నాడు. కలెక్షన్ల పరంగా ఈ మూవీ ప్రస్తుతం టాప్ 4లో కొనసాగుతూ వస్తోంది. ఇంతటి ఘనవిజయాన్ని అందించినందుకు ఎంతోమంది నిర్మాతలు తనతో సినిమా చేయడానకి ఆసక్తి చూపుతున్నారు కూడా! అయితే డాలీ మాత్రం తన తదుపరి చిత్రం పవన్’తోనే వుంటుందని అనౌన్స్ చేశాడు. అంతేకాదు.. త్వరలోనే స్ర్కిప్టును రెడీ చేయనున్నాడని తెలిపాడు! ప్రస్తుతం ‘గోపాల గోపాల’ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ప్రమోషనల్ ఈవెంట్స్’లో బిజీగా ఉన్న డాలీ.. జనవరి చివరికల్లా పవన్ కళ్యాణ్ మూవీ స్క్రిప్ట్’ని మొదలు పెడతాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  kishore parthasani dolly  gabbar singh 2  gopala gopala movie  

Other Articles