Director maniratnam ok bangaram movie shooting complete

mani ratnam news, director mani ratnam, ok bangaram movie, nitya menon latest news, mammutti son salman, ok bangaram movie shooting

director maniratnam ok bangaram movie shooting complete : finally director maniratnam completes his latest movie ok bangaram shooting in less time for the first time.

షార్ట్ టైంలో ముగించి.. షాకిచ్చిన మణి!

Posted: 01/10/2015 10:54 AM IST
Director maniratnam ok bangaram movie shooting complete

విభిన్నమైన ప్రేమ కథాచిత్రాలను తెరకెక్కించడంలో ప్రత్యేక ముద్రను వేసుకున్న దర్శకుడు మణిరత్నం.. తాజాగా అందరికీ తన డైరెక్షన్’తో షాకిచ్చాడు. ఎప్పుడూ తన స్లో డైరెక్షన్’తో షూటింగ్ జరుపుకోవడానికే ఎక్కువ సమయాన్ని కేటాయించే ఈ డైరెక్టర్.. ఈసారి అలాకాకుండా అతి తక్కువ సమయంలోనే తన మూవీ షూటింగ్’ని ముగించేసుకుని.. అప్పుడే రిలీజ్’కి ముహూర్తాలు పెట్టుకునే పనిలో నిమగ్నమైపోయారు. అంతేకాదు.. గతచిత్రాలకు భిన్నంగా ఈ చిత్రాన్ని ఆయన రూపొందించారని చిత్రం యూనిట్ చెబుతోంది.

మమ్ముట్టి తనయుడు దుల్ఖర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా మణిరత్నం దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం విదితమే! అంతే.. ఆ తర్వాత ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి వార్తలు అంతగా రాలేదు. కానీ.. ఇప్పుడు మాత్రం అతి తక్కువ సమయంలోనే మూవీ షూటింగ్ ముగించుకుని అందరికీ షాకిచ్చేలా ముందుకొచ్చారు మణిరత్నం. నిజానికి.. ఎక్కువ వర్కింగ్ డేస్ తీసుకుని షూటింగ్ చేస్తాడన్న పేరు మూటగట్టుకుని మణి.. తన తాజా చిత్రాన్ని అతి తక్కువ సమయంలోనే కంప్లీట్ చేసి, తాను కూడా ఫాస్ట్’గా తీయగలనని ప్రూవ్ చేసుకున్నాడు.

ఈ చిత్రానికి తమిళ, మలయాళ వెర్షన్లకు ‘ఓకే కన్మణి’ అనే టైటిల్’ను నిర్ణయించగా.. తెలుగు వెర్షన్’కి ‘ఓకే బంగారం’ పేరును ఖరారు చేసినట్లు చెబుతున్నారు. పీసీ శ్రీరాం ఛాయగ్రహణం అందించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చారు. షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది. త్వరలోనే విడుదల తేదీని ఖరారు చేయనున్నారని సమాచారం.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : director mani ratnam  ok bangaram movie news  nitya menon salman movie  

Other Articles