Tashu kaushik marriage news engagement devang raj tayal rajasthan heritage palace

tashu kaushik, tashu kaushik marriage news, tashu kaushik hot photos, tashu kaushik marriage issue, tashu kaushik engagement, tashu kaushik devang raj, tashu kaushik bikini photos, tashu kaushik hot gallery

tashu kaushik marriage news engagement devang raj tayal rajasthan heritage palace : Tashu kaushik is finally ready to marriage her boyfriend devang raj tayal. they already got engaged on january 4 and they are planning for their marriage.

ఆఫర్లు లేకపోవడం వల్లే తొందరపడి ఒప్పేసుకుందా..?

Posted: 01/10/2015 10:12 AM IST
Tashu kaushik marriage news engagement devang raj tayal rajasthan heritage palace

హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిపోదామని ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతిఒక్క అమ్మాయి.. మొదట్లో ఆఫర్లకోసం ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. చిన్న సినిమా అయినా.. పెద్ద చిత్రమైనా దాదాపుగా తమ అందచందాలను ఆరబోయాల్సి వుంటుంది. అంతేకాదు.. బెడ్’రూమ్ సన్నివేశాలు, బికినీలు వేయడం, లిప్’లాక్’లు వంటి సీన్లలో నటించాల్సి వస్తుంది. ఆ తర్వాతే అదృష్టం కలిసి వస్తే.. తదుపరి చిత్రాల్లో ఆఫర్లు వస్తాయి. అంతా చేసినా కూడా వాళ్లకి ఛాన్సెస్ రాకపోతే.. ఏవైనా మేగజైన్లకు సెక్సీ, బోల్డ్ ఫోటోషూట్స్ ఇస్తుంటారు.

అప్పుడు కూడా కుదరపోతే.. సొంతంగానే కాంట్రోవర్సీలు క్రియేట్ చేసుకుని సెన్సేషన్’గా నిలిచిపోతారు. అప్పుడైనా తమకు ఓ గుర్తింపు లభిస్తుందన్న ఆశ! ఇన్నీ చేసినా కూడా ఆఫర్స్ రాకపోతే.. చివరగా బాయ్’ఫ్రెండ్’తో కొన్నాళ్లు షికార్లు చేసి, పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతారు. ఇదీ.. ప్రస్తుతం ఇండస్ట్రీలో వున్న చాలామంది భామల వ్యవహారం. మొదట మూవీ ఆఫర్లకోసం ఎన్నితంటాలు పడినా ఆఫర్లు రాకపోతే.. పెళ్లివైపుకే అడుగులు వేస్తారు. ప్రస్తుతం నటి తషు కౌశిక్ వ్యవహారాన్ని గమనిస్తుంటే అలాగే అనిపిస్తోందని అంటున్నారు.

వర్ధమాన నటి అయిన తషుకౌశిక్.. ‘రాజు -మహారాజు’, ‘దుశ్వాసన’, ‘తెలుగబ్బాయి’, ‘వైకుంఠపాళి’ వంటి తెలుగు చిత్రాల్లో నటించింది. ఈమె కూడా ఇండస్ట్రీలో హీరోయిన్’గా ఓ వెలుగు వెలిగిపోదామని ఎన్నో ప్రయత్నాలు చేసింది. నటించిన ప్రతిసినిమాలోనూ తన అందచందాలను ఆరబోస్తూ.. కొన్ని హాట్ సన్నివేశాల్లోనూ నటించింది. అప్పుడప్పుడు కొన్ని హాట్ ఫోటోషూట్’లు కూడా ఇచ్చింది. అయితే.. కేవలం చిన్న సినిమాల నుంచి తప్ప.. భారీ ఆఫర్లు ఈమె దరికి చేరలేదు. పైగా.. ఈమె నటించిన చిత్రాలన్నీ బాక్సీఫీస్ దగ్గర బోల్తాపడినవే!

అయినప్పటికీ మూవీ ఆఫర్స్ కోసం ప్రయత్నించింది కానీ.. ఫలితం మాత్రం దక్కలేదు. అందుకే.. చేసేదేమీలేక తన జీవితంలో ఓ అరుదైన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నటి అప్పుడే మూడుముళ్లు వేయించుకోవడానికి సిద్ధంగా వుంది. తన చిన్ననాటి స్నేహితుడు దేవంగ్ రాజ్ తయాల్’ని ఈ హాట్ భామ మనువాడుతోంది. ఈనెల 4వ తేదీన కాన్పూర్’లో వీరి వివాహ నిశ్చితార్థం పెద్దల సమక్షంలో గ్రాండ్’గా జరిగింది. వీరి పెళ్లికి ఇంకా ముహూర్తం పెట్టలేదు కానీ.. రాజస్థాన్’లోని హెరిటేజ్ ప్యాలెస్’లో వివాహాన్ని నిర్వహించేందుకు నిశ్చయించారు.

tashu-kaushik-engaged

ప్రస్తుతం పెళ్లికిముందే తన కాబోయే భర్తతో కాలాన్ని ఎంజాయ్ చేస్తున్న తషూ.. పెళ్లి కార్యక్రమాలను పూర్తి చేసుకునే పనిలో నిమగ్నమైంది. వివాహం చేసుకున్న తర్వాత ఇక సినిమాల్లో నటించనని ఆమె చెబుతోంది. ఇదిలావుండగా.. మూడుపదుల సెక్సీ భామ త్రిష కూడా పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే! పారిశ్రామికవేత్త వరుణ్’కి, ఆమెకి ఈనెల 23వ తేదీన నిశ్చితార్థం జరుగబోతోంది. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే.. హీరోయిన్లకు పెళ్లి సీజన్ వచ్చేసినట్లుందని అంతా అనుకుంటున్నారు. మరి నెక్ట్స్ ఎవరో..?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tashu kaushik marriage  telugu heroines marriages  tollywood news  

Other Articles