Shruti hassan tollywood kollywood bollywood seven movies news

shruti hassan news, shruti hassan movies, shruti hassan hot photos, shruti hassan hot photo shoot, sruthi hassan hot photo shoot, sruthi hassan photos, sruthi hassan bollywood, sruthi hassan tollywood, sruthi hassa kollywood

shruti hassan tollywood kollywood bollywood seven movies news : actress shruti hassan present doing 7 movies in all languages

మూడు ముక్కలాటలో శృతి ఫుల్ బిజీబిజీ!

Posted: 01/06/2015 03:24 PM IST
Shruti hassan tollywood kollywood bollywood seven movies news

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్’గానే కొనసాగుతూనే అందివచ్చిన ఐటమ్ సాంగులను కూడా వరుసగా చేస్తూ దూసుకుపోతున్న హాట్ బ్యూటీ శృతిహాసన్.. ప్రస్తుతం మూడు ముక్కలాటలో ఫుల్ బిజీగా వుందని చెబుతోంది. తన కెరీర్’లోనే ఎప్పుడూ లేని విధంగా ఈ ఆటలో దిగ్విజయంగా కొనసాగుతున్నానని, అందుకు తాను ఎంతో సంతోషంగా వున్నానంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది అమ్మడు!

అసలు విషయం ఏమిటంటే - గతేడాదిలో రెండు లేదా మూడు సినిమాల్లో కనువిందు చేసిన శృతి.. ఈ ఏడాదిలో మాత్రం తనకు ఏకంగా ఏడు మూవీలు రిలీజులుంటాయని ఆనందంగా పేర్కొంటోంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళంతోబాటు బాలీవుడ్’లోనూ మూవీస్ చేస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్’లో పెద్ద సక్సెస్ కొట్టాలన్న కసితో అక్కడ నాలుగు సినిమాలు చేస్తోంది. ఆ నాలుగు చిత్రాలు ఈ ఏడాదిలోనే రిలీజవుతాయని స్వయంగా చెబుతోంది.

ఇక తమిళంలో ‘పులి’ సినిమాలో చేస్తున్నట్లు తెలిపింది. ఆ చిత్రం తనను మరో కొత్త కోణంలో ప్రెజెంట్ చేస్తుందనీ, ఇందులో కాస్ట్యూమ్స్ కూడా కొత్తగా వుంటాయని తెలిపింది. ఇటు తెలుగులోనూ ఇప్పటికే మహేష్’బాబు సరసన ఓ చిత్రం చేస్తున్నానని పేర్కొన్న ఆమె.. తాజాగా కార్తీ, నాగార్జున కలిసి నటించే మల్టీస్టారర్’లో నటించేందుకు సంతకం చేసినట్లు చెప్పింది. ఇలా ఈ విధంగా ఈ ముద్దుగుమ్మ ఒకేసారి మూడు భాషల్లో కలిపి ఏడు సినిమాల్లో నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shruti hassan news  bollywood movies  telugu news  

Other Articles