Amala paul husband vijay happy new year new york tour venad forest trecking

amala paul, amala paul hot photos, amala paul photo shoot, amala paul husband, amala paul husband vijay, amala paul holiday trips, amala paul vijay tour, venad forest, new york city

amala paul husband vijay happy new year new york tour venad forest trecking : amala paul enjoying with her husband in new york tour.

అదృష్టం అంటే ఇదేనేమో..!

Posted: 01/06/2015 12:51 PM IST
Amala paul husband vijay happy new year new york tour venad forest trecking

సినిమా ప్రపంచంలో హీరోయిన్’గా తన అదృష్టాన్ని పరీక్షించుకుని సక్సెస్ అయిన కేరళ కుట్టి అమలాపాల్... ఇప్పుడు పెళ్లైన తర్వాత కూడా మరింతగా జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఎలా అంటే.. తన భర్త విజయ్ ఆమెకు ఏది కావాలంటే అది క్షణాల్లో సమకూర్చడం, ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లడంతో అమ్మడు చాలా హ్యాపీగా వుందట!

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అమలా న్యూయార్క్’లో జరుపుకుందామని ప్రపోజ్ చేయగానే.. అందుకు విజయ్ ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా అన్ని ఏర్పాట్లూ చేసి తీసుకువెళ్లాడు. అక్కడే థర్టీ ఫస్ట్ నైట్’ని బాగానే ఎంజాయ్ చేశారట! ప్రస్తుతం వీరిద్దరు ఇంకా అక్కడే హాలీడే గడుపుతున్నారు.

అంతేకాదు.. తాజాగా అమ్మడికి అక్కడి సమీపంలోని ‘వేనాద్ ఫారెస్ట్’లో ట్రెక్కింగ్’కి వెళ్లాలనిపించిందట! దాంతో వెంటనే విజయ్ ఆమెను అక్కడికి తీసుకెళ్లాడు. అయితే అక్కడ నడిచే క్రమంలో ఈ బ్యూటీ నడిచి నడిచి అలసిపోతే.. అది చూసి తట్టుకోలేక పోయిన ఆమె భర్త ఆమెను తన వీపుపై ఎక్కించుకుని మరీ కాసేపు వరకు మోశాడట!

భర్త విజయ్ తన భార్య అమలా సంతోషాన్ని పూర్తి చేయడంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నందుకు నిజంగానే ఆమె అదృష్టవంతురాలని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amala paul husband vijay  venad forest trecking  tollywood actresses  

Other Articles