Pawan kalyan on fan srinivas attack

Pawan Kalyan on srinivas, Pawan Kalyan on fan attack, Pawan Kalyan updates, Pawan Kalyan twitter, Pawan Kalyan song in gopala gopala, gopala gopala movie songs, gopala gopala latest updates, gopala gopala movie news, gopala gopala trailer, tollywood updates, telugu updates

Pawan Kalyan on fan srinivas attack : power star Pawan Kalyan responded on attack of srinivas incident says its unfortunate and panic. Pawan Kalyan says he will soon meet his fan srinivas and hopes fans should be alert to avoid these type of situations next time

అభిమానుల భద్రతే నాకు ముఖ్యం

Posted: 01/06/2015 01:42 PM IST
Pawan kalyan on fan srinivas attack

గుంటూరుకు చెందిన తన అభిమాని శ్రీనివాస్ పై దుండగులు దాడి చేసి, గొంతు కోసిన ఘటనపై పవన్ స్పందించాడు. ఈ వ్యవహారంపై ట్విట్టర్ లో కామెంట్ చేసిన పవన్.., ఆదివారం నాటి ఘటన చాలా దురదృష్టకరమన్నారు. ఈ వార్త తనను బాగా కలిచివేసిందన్నారు. ఒక అభిమానిపై దాడి జరగటం పట్ల చాలా బాధపడ్డానన్నారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన తర్వాత పవన్ ను వ్యక్తిగతంగా కలుస్తానని చెప్పారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అభిమానుల భద్రతే తనకు ముఖ్యమని ట్వట్టర్ లో పేర్కొన్నాడు. ఆస్పత్రిలో ఉన్నా శ్రీనివాస్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలిసులు నిందితుడు ఫొటోతో పాటు అతడికి సహకరించిన వారి ఫొటోలను మీడియాకు వివరించారు. ఈ వివాదానికి పవన్ తో సంబంధం లేదనీ.. శ్రీనివాస్ కు సంబంధించి వ్యక్తిగత విషయాల వల్లే దాడి జరిగినట్లు పోలిసులు చెప్తున్నారు.

‘గోపాల గోపాల’ ఆడియో రిలీజ్ చూసేందుకు గుంటూరు నుంచి వచ్చిన పవన్ ఫ్యాన్ శ్రీనివాస్ పై ఆదివారం సాయంత్రం శిల్పకళా వేదిక దగ్గర దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితులను పట్టుకోవటంతో పాటు, వారు దాడి చేయటానికి గల అసలు కారణాలను వెలికి తీయటంపై పోలిసులు దృష్టి సారించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopala Gopala movie  Pawan Kalyan twitter  srinivas  

Other Articles