Gopala gopala trailer

Gopala Gopala Trailer, Gopala Gopala songs, Gopala Gopala updates, Gopala Gopala release date, Gopala Gopala audio songs, Gopala Gopala wallpapers, Gopala Gopala latest photos

Gopala Gopala Trailer : Gopala Gopala movie released audio and trailer on sunday. Gopala Gopala Trailer attracting fans of pawan and venkatesh. Gopala Gopala movie going to release for sankranti and songs got good response

పంచ్ డైలాగే పవన్ సమాధానం, విడుదలపై వీడిన సస్పెన్స్

Posted: 01/05/2015 12:57 PM IST
Gopala gopala trailer

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘గోపాల గోపాల’ విడుదలకు సిద్దమవుతోంది. సంక్రాంతి కానుకగా కృష్ణయ్యగా ప్రేక్షకులను అలరించేందుకు పవన్ సిద్ధమయ్యాడు. ఆదివారం సాయంత్రం విడుదలైన ఆడియో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. మూడు పాటలే ఉన్నా కూడా అన్నీ చాలా బాగున్నాయని కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ పాటలు తెలుగు ప్రేక్షకుల మొబైల్ రింగ్ టోన్లుగా మారిపోయాయి. ఇక ఆడియో రిలీజ్ తో పాటు విడుదల అయిన ట్రైలర్ కూడా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.

సినిమాలో ఉన్న ప్రధాన క్యారెక్టర్లు, మెయిన్ సీన్లను కలిపి విడుదల చేసిన ఈ ట్రైలర్ అదరగొడుతోంది. ‘మార్కెట్ లోకి కొత్త దేవుడు వచ్చి చాలా కాలం అయింది’, ‘కృష్ణుడు మన కాలనీకి వచ్చేస్తున్నాడు’ వంటి డైలాగులు బాగా ఆకట్టుకుంటున్నాయి. అన్నిటికంటే ఎక్కువగా చివర్లో పవన్ చెప్పిన ‘రావడం ఆలస్యం కావచ్చు కానీ.., రావటం మాత్రం పక్కా’ అంటూ చెప్పిన డైలాగ్ సూపర్ గా ఉందని టాక్ విన్పిస్తోంది. ఈ డైలాగ్ సినిమాకు సంబంధించినది అయినా.., విడుదలపై నెలకొన్న ఊహాగానాలకు పంచ్ ఇచ్చేలా ఉందని చెప్తున్నారు.

పవన్ డైలాగ్ తోనే ‘గోపాల గోపాల’ సినిమా సంక్రాంతికి ఖచ్చితంగా విడుదల అవుతుందని స్పష్టం అవుతోంది. ‘ఐ’కి పోటిగా వస్తున్న ఈ తెలుగు సినిమా, జనవరి 14న విడుదల కానుంది. సినిమా విడుదలకు ఇంకా పది రోజులు ఉండటంతో అప్పటివరకు ఆగలేని ప్రేక్షకుల కోసం ట్రైలర్ ను అందిస్తున్నాం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopala Gopala trailer  Gopala Gopala movie  tollywood updates  

Other Articles