సినిమా హీరోయిన్ అంటే చాలు మూవీల కంటే ఎఫైర్లు, డేటింగ్ బాయ్ ఫ్రెండ్ గాసిప్ ల గురించే ఎక్కువగా మాట్లాడుతారు. ఇందుకు పెద్ద, చిన్న.. సీనియర్, జూనియర్ అనే తేడా లేదు. హీరోయిన్ అయితే చాలు యవ్వారం అంటగట్టేసి అనుమానాలు పెంచుతారు అని కాజల్ భామ మండిపడుతోంది. ఎందుకంటే ఇన్నాళ్లు ఇతర అందాల భామలకు పరిమితమైన ఈ పుకార్లు ఇఫ్పుడు అమ్మడిని టార్గెట్ చేశాయి. కాజల్ కు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడట అని సోషల్ మీడియాలో పుకార్లు ట్రెండ్ అవుతున్నాయి. ఎవరు.. ఎలా ఉంటాడు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటున్నారు, ఊహాజనిత సమాధానాలు ఇస్తున్నారు.
ఈ కామెంట్లు, పుకార్ల గురించి తెలుసుకున్న కాజల్ భామ కస్సుమంది. మీకెవరు చెప్పారు నేను ప్రేమలో పడ్డానని అని ప్రశ్నిస్తోంది. ‘సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నాకు, ఫ్యామిలీ.. ఫ్రెండ్స్ తో గడిపే సమయమే లేదు. ఇంక ప్రేమించి, ప్రేమకోసం సమయం కేటాయించే తీరిక ఎక్కడుంటుంది’ అని ప్రశ్నిస్తోంది. మొత్తం సినిమాలతోనే గత సంవత్సరం గడిచిపోయింది, ఈ ఏడాది కూడా ఫుల్ లెన్త్ షెడ్యూల్ ఉంది. కాబట్టి ప్రేమించటానికి సమయం ఎక్కడుంది అని ప్రశ్నిస్తోంది. ఎందుకండి ఇలాంటి పుకార్లు పుట్టించి ఇబ్బంది పెట్టడం అంటూ నీతి వాక్యాలు చెప్తోంది.
ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, ఎవరిని చేసుకుంటారు అని అడిగితే.. ఇప్పటివరకయితే నాకు సరైన మగాడు కన్పించలేదు అని సమాధానం ఇచ్చింది. జీవితాంతం ఒంటరిగానే ఉండలేము కదా సమయం వచ్చినప్పుడు పెళ్ళి గురించి మాట్లాడుదాం అని వివరణ ఇచ్చింది. ప్రేమించలేదు సరే, ఎలాంటి వ్యక్తిని కోరుకుంటారు అని అడిగితే.., సైలెంట్ గా పక్కకు తప్పుకుందీ 29ఏళ్ళ చిన్నది. చూడాలి మరి మూడు పదుల వయస్సులో మూడు ముళ్ళు పడుతాయా లేక.., ముదిరిన వయసుతో పెళ్లి పీటలపై కూర్చుంటుందా.?
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more