Tollywood cinema artist ahuthi prasad passes away

ahuthi prasad passes away, artist ahuthi prasad passes away, charecter artist ahuthi prasad passes away, tollywood mourns for ahuthi prasad demise, ahuthi prasad latest news, ahuthi prasad updated news, ahuthi prasad movies, ahuthi prasad photos, ahuthi prasad news, ahuthi prasad mo more

tolly wood mourns as character artist ahuthi prasad passes away

నేలరాలిన మరో సినీకళామతల్లి పుత్రరత్నం.. టాలీవుడ్ లో విషాదం..

Posted: 01/04/2015 01:41 PM IST
Tollywood cinema artist ahuthi prasad passes away

ప్రముఖ సినీనటుడు ఆహుతి ప్రసాద్ కన్నుమూశారు. గతకొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన పికింద్రాబాద్ లోని కిమ్స్లో చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం మరణించారు. ఆయన వయస్సు 58 ఏళ్లు. 1958 జనవరి 2 న కృష్ణాజిల్లా కోడూరులో జన్మించిన ఆహుతి ప్రసాద్ అసలు పేరు అడుసుమిల్లి జనార్దన వరప్రసాద్‌. ఆయనకు ఇద్దరు పిల్లలు.

ఈ ప్రశ్నకు బదులేది అనే సినిమా ద్వారా ఆయన వెండితెరకు పరిచయమయ్యారు. ఆహుతి చిత్రంతో మంచి పేరు రావడంతో సినిమానే ఇంటి పేరుగా మార్చుకున్నారు. గులాబి, నిన్నే పెళ్లాడతా, జయం మనదేరా, చందమామ , కొత్తబంగారు లోకం, బెండు అప్పారావు, సిద్ధు ఫ్రమ్‌ శ్రీకాకుళం వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విలన్,  క్యారక్టర్ ఆర్టిస్ట్, హస్య నటుడిగా ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు. 2002, 2007 సంవత్సరాల్లో ఆయన నంది అవార్డు అందుకున్నారు.

ఇండస్ర్టీలో అంచెలంచెలుగా ఎదిగిన ప్రసాద్ ‘మా’ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 122 సినిమాల్లో ఆహుతి ప్రసాద్ నటించారు. తెలుగులో 120, రెండు తమిళ చిత్రాలు చేశారు. 'చందమామ' చిత్రానికి బెస్ట్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నంది అవార్డులు అందుకున్నారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు.

అహుతి ప్రసాద్ మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగింది. క్యారెక్టర్ అరిస్టు నుంచి అంచెలంచెలుగా పైకి ఎదుగుతున్న తరుణంలో ఆయనను విధి తమనుంచి దూరం చేసిందని పలువరు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు సెలబ్రీటీలు కూడా అహుతీ ప్రసాద్ అకాల మరణం పట్ల దిగ్ర్భంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ahuthi prasad  Tollywood  artist  passes away  

Other Articles