Shankar i movie telugu audio released shankar i movie telugu audio released

Shankar I movie, I telugu audio released, I telugu songs, I telugu movie songs, I telugu latest, I movie telugu release date, I movie telugu release problems, I manoharudu latest photos, I telugu audio release photos, I manoharudu wallpapers, Vikram photos, Vikram photos in I movie, tollywood latest, telugu movies updates, upcoming telugu movies, 2015 telugu movies

Shankar I movie telugu audio released : Tamil director Shankar picturized I movie telugu version audio released on 30th december evening. SS Rajamouli came as chief guest for I telugu Audio release. I movie going to release on 14th January 2015

‘ఐ’తెలుగు ఆడియో విడుదల

Posted: 12/31/2014 07:40 AM IST
Shankar i movie telugu audio released shankar i movie telugu audio released

అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. ఏడాది చివరి కనువిందు చేస్తోంది. భారతీయ సినిమా అంటే హాలీవుడ్ కు తీసిపోదు అని నిరూపిస్తోన్న ‘ఐ’ మూవీ తెలుగు వర్షన్ పాటలు విడుదల అయ్యాయి. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిధిగా హాజరైన దర్శకుడు రాజమౌళి ఆడియో సీడీ ఆవిష్కరించి.., ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అందించారు. ఈ ఆడియె కార్యక్రమం కోసం తెలుగు తమిళ ప్రముఖుులు ఒక్కసారిగా మెరవటంతో వేదికంతా వెలుగులు నింపుకుంది.

సినిమా గురించి మాట్లాడిన హీరో విక్రమ్..,. ఈ ప్రాజెక్టు కోసం తాను చాలా కష్టపడ్డానని చెప్పారు. ఎంత కష్టమో చెప్పాలన్నా కూడా చాలా కష్టమన్నారు. అయితే మూవీని చూస్తే.., తాను అంతగా ఎందుకు రిస్క్ చేశానో అందరిి తెలుస్తుందన్నారు. ‘ఐ’ మూవీ రికార్డులు క్రియేట్ చేయటం ఖాయంగా చెప్పారు. అటు టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి కూడా విక్రమ్ పడిన కష్టాన్ని గుర్తు చేవారు. అటు శంకర్ సినిమాలు వచ్చాయంటే ప్రతి ఒక్కరూ నెలల తరబడి వాటి గురించే మాట్లాడుకునేలా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతారని చెప్పారు.

అందరూ తన సినిమాల గురించి... అందులోని కష్టం గురించి మాట్లాడుతున్నా వాటి గురించి చెప్పటం తనకు ఇష్టముండదని ‘ఐ’ క్రియేటర్ శంకర్ అన్నారు. మూవీకి ఇప్పటికే బాగా క్రేజ్ వచ్చిందనీ.., అందరూ ‘ఐ’ ఫీవర్ లో ఉన్నారని వివరించారు. సినిమాకు తనకంటే విక్రమ్ చాలా కష్టపడ్డాడు అని ప్రశంసించారు. తనను ఇంతలా ఆదరిస్తున్న తెలుగు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే తెలుగులో సినిమా తీస్తానని చెప్పారు. ఇలా కార్యక్రమానికి హాజరైన వారంతా విక్రమ్ కష్టం, శంకర్ కల...కళ గురించి ప్రశంసలతో ముంచెత్తారు. సంక్రాంతి కానుకగా ‘ఐ’ విల్ సీ యూ అంటూ వస్తున్న ఈ మూవీ న్యూ ఇయర్ కానుకగా యు లిజన్ మీ అంటూ వచ్చేసింది. సో ఆడియో వింటూ ఈ పక్షం రోజులు ఓపిక పట్టండి.. సంక్రాంతికి థియేటర్లను, బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేందుకు మూవీ వచ్చేస్తుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : I telugu  I telugu songs  shankar  

Other Articles