Ntr temper movie latest look

NTR, Temper movie, Temper movie latest updates, Temper movie latest look, Temper first look photo, Temper latest photos, Temper movie NTR photos, Temper movie Audio release, temper movie updates, NTR latest, NTR latest photos, NTR wallpapers, NTR upcoming movies, tollywood latest, upcoming telugu movies, telugu movies in 2015

NTR Temper movie latest look : NTR Lead role played temper movie released new look of hero. Temper movie latest look got simply supurb response. temper movie shooting continues in Begumpet, picturizing court and police station scenes

‘టెంపర్’ లేటెస్ట్ లుక్ సింప్లీ సూపర్

Posted: 12/30/2014 05:16 PM IST
Ntr temper movie latest look

సంక్రాంతికి సినిమా రావటం లేదని బాధపడుతున్న నందమూరి అభిమానులకు తారక్ కానుక ప్రకటించాడు. న్యూ ఇయర్ కు రెండ్రోజుల ముందుగానే ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇచ్చాడు. ‘టెంపర్’ లేటెస్ట్ లుక్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. నీలం రంగు బ్యాగ్రౌండ్ తో ఉన్న పోస్టర్ లో బ్లూ షర్ట్ అండ్ జీన్స్ వేసుకున్న తారక్ లుక్ కేక పుట్టిస్తుంది. ఫస్ట్ లుక్ లో సీరియస్ ఫేస్ తో అందర్నీ భయపెట్టిన నందమూరి తారక రాముడు.., లేటెస్ట్ ఫొటోతో మాత్రం తన స్టైల్ ను మరోసారి పరిచయం చేస్తున్నాడు. ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్ సింప్లి సూపర్బ్ అని కామెంట్ చేస్తున్నారు.

సంక్రాంతి విడుదల బరి నుంచి తప్పుకున్న ఈ సినిమా పిబ్రవరి 5న విడుదల అవుతుంది. ఈ లోపు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసేందుకు మూవీ యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. బేగంపేటలో వేసిన కోర్టు, పోలిస్ స్టేషన్ సెట్టింగ్ లలో కీలక సన్నివేశాల షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సారి ఏదేమైనా పిబ్రవరి 5కు సినిమా వస్తుందని మూవీ యూనిట్ ధీమాగా చెప్తోంది. ఇక ఆడియో విడుదల విషయానికి వస్తే సంక్రాంతి తర్వాత ఉంటుందని చెప్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

NTR-Temper

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా పరమేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పై వస్తున్న ఈ సినిమాను బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ అందిస్తున్న సంగీతం ఆకట్టుకుంటుందని అంతా చెప్తున్నారు. అనూప్ పై ఉన్న నమ్మకంతోనే ముందుగా ఎంపిక చేసిన దేవిశ్రీని పక్కనబెట్టి మరీ అవకాశం ఇచ్చారు. అనేక కారణాలతో వాయిదాలు పడుతూ వస్తున్న సినిమా ఈ దఫా అయినా సమయానికి రావాలని ‘తెలుగు విశేష్’ కోరుకుంటూ తారక్ లేటెస్ట్ లుక్ మీకోసం అందిస్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Temper  NTR latest look  puri jagannath  

Other Articles