Akhil akkineni debut shooting schedule

Akhil Akkineni, Akhil Akkineni debut, Akhil Akkineni movies, Akhil Akkineni movie shooting, Akhil Akkineni updates, Akhil Akkineni latest, Akhil Akkineni movies, Akhil Akkineni first look, Akhil Akkineni latest photos, Akhil Akkineni wallpapers, tollywood latest, tollywood updates, latest telugu movies, upcoming telugu movies, VV Vinayak, VV Vinayak movies

Akhil Akkineni debut shooting schedule : Akkineni family latest hero Akhil’s debut was launched few days ago and according to the latest update, regular shooting will begin from first week of January. first part of Akhil movie shooting will be in the Old City of Hyderabad with an action sequence.

అఖిల్ మూవీ లేటెస్ట్ అప్ డేట్

Posted: 12/30/2014 09:19 AM IST
Akhil akkineni debut shooting schedule

అక్కినేని అఖిల్ సినిమా లాంచ్ అయి రోజులు గడుస్తున్నా ఇంకా షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. కొద్ది రోజులగా అఖిల్ మూవీ గురించి పెద్దగా గాసిప్స్ కూడా ఏమి విన్పించటం లేదు. దీంతో క్రేజ్ తగ్గింది అనుకుంటున్న తరుణంలో లేటెస్ట్ గా ఓ  అప్ డేట్ విన్పిస్తోంది. అఖిల్ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుందట. జనవరి మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని మూవీ యూనిట్ నుంచి సమాచారం వస్తోంది. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో తొలి షెడ్యూల్ ప్రారంభిస్తారట.

ఓల్డ్ సిటీలో యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తారని తెలుస్తోంది. దీన్ని బట్టే ఈ సినిమా యాక్షన్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్ మిక్చర్ గా తెలుస్తోంది. వి.వి. వినాయక్ సినిమాలన్నీ ఇలాగే భారీగా ఉంటాయని తెలిసిందే. ఇక యాక్షన్ సన్నివేశాల కోసం అక్కినేని హీరో బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడట. ఫైట్లు, స్టంట్లను ప్రాక్టీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. అందుకే న్యూ ఇయర్ వేడుకలకు కూడా ఎక్కడా ప్లాన్ చేయకుండా ప్రాక్టీస్ చేస్తాడట. ఫస్ట్ షెడ్యూల్ కు సంబంధించి ప్రి ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఓల్డ్ సిటీలో షూటింగ్ జరిగే ప్లేస్, సమీప లొకేషన్లను మూవీ యూనిట్ కు చెందిన వ్యక్తులు పరిశీలించి వచ్చారు.

‘డమరుకం’కు కథ అందించిన వెలిగొండ శ్రీనివాస్ అఖిల్ తొలి సినిమాకు కూడా స్టోరీ అందిస్తున్నారు. వినాయక్ ప్రొడక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు హీరో నితిన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. నితిన్ కు నిర్మాతగా ఇదే తొలి సినిమా కావటం విశేషం. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డికి చెందిన శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సినిమా తెరకెక్కుతోంది. తొలి సినిమాలో అఖిల్ సరసన ముంబై భామ అమీరా దస్తూర్ నటించనుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Akhil Akkineni  Tollywood Updates  VV Vinayak movies  

Other Articles