Dil raju takes gopala gopala nizam rights

Gopala Gopala, Dil Raju buys Gopala Gopala, Dil Raju Owns Gopala Gopala, Gopala Gopala latest, Gopala Gopala photos, Gopala Gopala songs, Gopala Gopala audio release, Gopala Gopala updates, Gopala Gopala cast and crew, Gopala Gopala latest photos, Gopala Gopala wallpapers, Gopala Gopala teaser, pawan kalyan photo in Gopala Gopala, venkatesh photo in Gopala Gopala, upcoming telugu movies

Dil Raju takes Gopala Gopala Nizam rights : Failure Disributer turned Hit producer Dil Raju again trying his luck in new business. film nagar talk that Dil Raju owned Gopala Gopala Nizam rights for a fancy price. Gopala Gopala movie shooting in full swing shooting

పవన్ పై నమ్మకంతోనే అంత పెట్టాడట

Posted: 12/29/2014 04:22 PM IST
Dil raju takes gopala gopala nizam rights

దిల్ రాజుకు పేరుకు తగ్గట్లే దిల్ చాలా గట్టిగా ఉన్నట్లుంది. లేకపోతే.., నిర్మాతగా హిట్లు కొట్టి కలెక్షన్ల కింగ్ గా ఎదిగిన నిర్మాత డిస్ర్టిబ్యూషన్ మొదలు పెట్టి కుదేలయ్యాడు. ఒకే ఏడాదిలో మూడు సినిమాలు హ్యాట్రిక్ ఫ్లాపులు కొట్టాయి. అయినా సరే గుండె ధైర్యం కోల్పోలేదు. పోయిన చోటే వెతుక్కోవాలి అన్నట్లుగా పంతం.. కసితో మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ మొదలుపెడుతున్నాడు. నిర్మాత అయితేనే బాగుంటుంది అని సన్నిహితులు సూచిస్తున్నా వినటం లేదు. పంపిణీ చేసి పోయిన డబ్బులు తిరిగి రాబడుతా అని పంతంగా ఉన్నాడు.

వెంకటేష్ - పవన్ కాంబినేషన్ లో వస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘గోపాల గోపాల’ సినిమా హక్కులను రాజు తీసుకున్నాడట. నైజాం ఏరియాకు పంపిణీ కోసం ఏకంగా పదమూడున్నర కోట్ల రూపాయలు కోట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కలెక్షన్ల పరంగా చూస్తే.., పవన్ కు పద్నాలుగు కోట్లు వసూలు చేసే కెపాసిటీ ఉంది. అయితే ఈ సినిమాలో పవర్ స్టార్ పాత్ర తక్కువ నిడివి ఉంటుంది. వెంకటేష్ కు ఏడు కోట్ల వరకు వసూలు చేసే సత్తా ఉంది. అందుకే వెంకటేష్ రేటను అలాగే ఉంచి.. పవన్ క్యారెక్టర్ తక్కువగా ఉన్నందున ఆయన రేటును సగానికి తగ్గించినట్లు క్యాలిక్యులేషన్లు చెప్తున్నాయి. ఏదేమైనా ఇలాంటి సమయంలో దిల్ రాజు ఇంత డబ్బు పెట్టుబడి పెట్టడం అంటే.. సాహసం చేయటమే. అయితే పవన్ కు ఉన్న క్రేజు.., సినిమాకు వస్తున్న ఆదరణకు ఇది సరైన రేటే అని దిల్ రాజు సన్నిహితులు అంటున్నారు.

ఈ ఏడాదిలో దిల్ రాజు పంపినీ చేసిన ‘రభస’, ‘ఆగడు’ ఫ్లాపు కాగా.., ‘గోవిందుడు అందరివాడేలే’ ఆశించిన మేర కలెక్షన్లు వసూలు చేయలేదు. దీంతో భారీ అంచనాలతో థియేటర్లను మేనేజ్ చేసి ఇబ్బందులు పడ్డాడు. ‘గోపాల గోపాల’తో ఆశించిన స్థాయి డబ్బులు వచ్చినా.., అదంతా గత ఇబ్బందుల నుంచి బయట పడేందుకు ఉపయోగపడుతుంది తప్ప..., సెటిల్ కావటానికి సహకరించదు. ‘గోపాల గోపాల’ విషయానికి వస్తే.., సంక్రాంతి కానుకగా జనవరి 09న విడుదల అవుతోంది. చివరి దశ షెడ్యూల్ షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. జనవరి 3న మూవీ ఆడియో రిలీజ్ వేడుక ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై మూవీ యూనిట్ ప్రకటన చేయాల్సి ఉంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopala Gopala  Dil raju  upcoming telugu movies  

Other Articles