తెలుగు సినిమాల్లో తాగుబోతు క్యారెక్టర్లకు ఎం.ఎస్. నారాయణ తర్వాత న్యాచురాలిటీ తీసుకొచ్చిన నటుడు తాగుబోతు రమేష్. ‘అలా మొదలైంది’లో అబ్బా తమ్ముడూ అంటూ ఇండస్ట్రీ కెరీర్ మొదలు పెట్టిన రమేష్ ప్రస్తుతం బిజీ కమెడియన్ గా ఉన్నాడు. సినిమాలో తాగుబోతు వేషం ఉందంటే అక్కడీ నల్లబాలు ఉండాల్సిందే. మందు తాగే అలవాటు లేకున్నా... అచ్చం తాగినోడిలా నటించే ఈ క్యారెక్టర్ ఆర్టిస్టుకు మంచి రోజులు వచ్చాయి. నటనను నమ్ముకుని చిన్నచిన్న వేషాలు వేసిన రమేష్ త్వరలో హీరో అవుతున్నాడు.
తెలుగు ప్రజెంట్ పాపులర్ కమెడియన్లలో ఒకడైన రమేష్ ను కన్నడ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. డైరెక్టర్ త్రిశూల్ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కన్నడ, తెలుగు భాషల్లో షూట్ అవుతుండటంతో.., రమేష్ విశ్వరూపం చూసేందుకు తెలుగువారికీ అవకాశం దక్కనుంది. ద్విబాషా చిత్రంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్టులో మేఘనా రెడ్డి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే బెంగళూరులో ప్రారంభమైంది.
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన రమేష్, చిన్నప్పటినుంచీ నటనపై ఆసక్తి. కుటుంబంలో అంతా మిగతా రంగాల్లో స్థిరపడ్డా, రమేష్ మాత్రం నటుడిగా నలుగురినీ మెప్పించాలని చాలా కష్టపడ్డాడు. ఈయన కోరికను కాదనలేక కుటుంబ సభ్యులు ప్రోత్సహించటంతో కమెడియన్ గా ఎదిగాడు. తన తండ్రి తాగి ఇంటికి వచ్చాక ప్రవర్తించే విధానం బాగా గమనించిన రమేష్ కు ఆయనలా నటించటం వచ్చు. మందు తాగే అలవాటు లేకపోయినా.., తండ్రిని గుర్తు చేసుకుంటే వెంటనే క్యారెక్టర్లోకి దూరిపోతాడు. తాగుబోతుగా అందర్నీ మెప్పించిన ఈ డ్రింకింగ్ స్టార్ హీరోగా ఉన్నత స్థాయికి ఎదగాలని ‘తెలుగు విశేష్’కోరుకుంటోంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jun 01 | బ్రహ్మాస్త్ర ఫిల్మ్‌కు చెందిన కొత్త అప్డేట్ వచ్చింది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ ఫిల్మ్‌కు చెందిన కొత్త టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌తో పాటు ఇతర స్టార్స్ ఉన్న ఆ... Read more
Jun 01 | బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాథ్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. కేకేగా చిరపరిచితమైన ఆయన కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు. కేకే పాటలకు స్టెప్పులేసిన అభిమానులు.. ఆ... Read more
May 30 | కరోనా లాక్ డౌన్ లో వాయిద పడ్డ సినిమాలన్ని వరుస పెట్టి విడుదల అవుతున్నాయి. గతేడాది పుష్ప, అఖండ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ధైర్యాన్ని ఇచ్చాయి. అదే క్రమంలో... Read more
May 30 | ఉప్పెన' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పర్చుకన్న మంగళూరు బ్యూటీ కృతిశెట్టి తన కెరీర్ లోనూ విజయాల పరంపరను సోంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తొలి... Read more
May 30 | యాక్టింగ్‌లోనే కాదు సినిమా ప్రమోషన్లలోనూ తన దారి సపరేటు అని నిరూపించారు ప్రముఖ నటుడు, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు. తాను నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యానని చెప్పిన మహేశ్ బాబు.. త్వరలో విడుదల కానున్న... Read more