K balachander death film celebrities tribute condolence

k balachander death, k balachander death latest updates, k balachander funeral last rites updates, celebrities on k balachander death, k balachander condolence, tollywood on k balachander death, koliwood stars artists on k balachander death, tollywood latest news updates

k balachander death film celebrities tribute condolence : tollywood, koliwood industries celebrities and artists pays tribute to k balachander and remembers his dedication service to film industry

సినిమా అగ్రజుడికి అశ్రునివాళి.. తల్లడిల్లుతున్న తారాలోకం

Posted: 12/24/2014 08:29 AM IST
K balachander death film celebrities tribute condolence

సినీ కళామతల్లి ముద్దు బిడ్డ అస్తమించాడు. ఎన్నో సినిమాలు తెరకెక్కించిన దార్శనిక దర్శకుడు తన జీవితానికి ముగింపు ఇచ్చుకున్నాడు. కళామతల్లికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలంటూ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ప్రస్తత అగ్రనటులకు నటనా ఓనమాలు నేర్పిన మాష్టారు ఇవాళ ఇండస్ర్టీకి దూరం అయ్యారు. బాలచందర్ మరణంతో తెలుగు, తమిళ సినీ పరిశ్రమ విషాదంలోకి మునిగిపోయింది. నిర్మాతగా, రచయితగా, దర్శకుడుగా ఇండస్ర్టీ తొలితరం ప్రముఖుల్లో ఒకరుగా ఉన్న ఆయన మరణం తీరని లోటుగా తారాలోకం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

కొద్దికాలంగా అనారోగ్యంతో బాదపడుతున్న 84ఏళ్ళ బాలచందర్ మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 101 సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాకుండా పలు సినిమాలకు నిర్మాతగా, రచయితగా వ్యవహరించారు. ఇండస్రీకి చేసిన సేవలకు గాను పద్మశ్రీ, ఏ.ఎన్.ఆర్. జాతీయ పురస్కారం, కళైమామణి వంటి అవార్డులు, బిరుదులతో పాటు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వరించింది. రజినీకాంత్, కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ వంటి ప్రస్తుత గొప్ప నటులందర్నీ ఇండస్ర్టీకి పరిచయం చేసి.., నటనలో రాటుతేలేలా చేసిందీ దర్శక దిగ్గజమే.

బాలచందర్ మరణవార్త విన్న కోలీవుడ్ తల్లడిల్లుతోంది. ఇండస్ర్టీకి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి కుటుంబాన్ని వదిలి వెళ్ళారని ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతికి సంతాపంగా కోలీవుడ్ ఇవాళ బంద్ పాటిస్తోంది. తమిళనాడు వ్యాప్తంగా ఇవాళ సినిమా షూటింగులు నిలిపివేస్తున్నట్లు నడిగర్ సంఘం ప్రకటించింది. మరోవైపు  విషయం తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. బాలచందర్ మృతి ఇండస్ర్టీకి తీరని లోటుగా సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ విాచరం వ్యక్తం చేశారు. తమకు బాటలు వేసిన గురువు దూరం కావటం కలచివేస్తోందన్నారు. బాలచందర్ లాంటి దార్శనికుడు మరొకరు ఉండరని ప్రముఖ నటి నిర్మాత రాధికశరత్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

తెలుగు పరిశ్రమ కూడా బాలచందర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసింది. ఆయన తెలుగులో కూడా సినిమాలు తీయటంతో ఇక్కడి నటులతో కూడా అనుబంధం ఉంది. నటుల్లోని అభినయాన్ని పూర్తిగా బయటకు తీసే డైరెక్టర్ గా పేరున్న బాలచందర్ మరణం ఇండస్ర్టీకి గ్రేట్ షాక్ లాంటిదని కె.విశ్వనాధ్ అన్నారు. తమలాంటి వారికి ఆయనో టెక్ట్స్ బుక్ లాంటివారని చెప్పారు. అటు జయసుద కూడా దర్శక దిగ్గజంతో అనుభవాలను గుర్తు చేసుకుంది. బాలచందర్ స్కూల్ లో చదువుకుని తాను ఈ స్థాయికి ఎదిగానని చెప్పింది. సార్ వద్ద భయంతో, భక్తితో ఉండేవాళ్ళమన్నారు. కోపం, చిరునవ్వు, ప్రేమ కలిపితే చందర్ అని చెప్పారు. తణికెళ్ల భరణి, జయప్రద సహా ఇతర టాలీవుడ్ ప్రముఖులు కూడా బాలచందర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇండస్ర్టీలో రాలిపోయిన దృవతారకు సంతాపం ప్రకటించారు.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : k balachander death  celebrities on balachander  tollywood latest  

Other Articles