Narendra modi praises pawan kalyan gopala gopala singer kailash kher

narendra modi praises kailash kher, kailash kher swachh bharat mission campaign, kailash kher gopala gopala song, kailash kher latest updates, kailash kher movie updates, gopala gopala latest updates, gopala gopala release date, gopala gopala kailash kher song, gopala gopala posters wallpapers, gopala gopala trailers, tollywood latest news updates

narendra modi praises pawan kalyan gopala gopala singer kailash kher : Prime Minister Narendra Modi lavished praises on popular singer Kailash Kher. Kailash Kher recently participated in Modi's swachh bharat mission by sweeping Bhadaini ghat on the banks of river ganga at Varanasi.

పవన్ కోసం పాడిన ఖైలాష్ ను మెచ్చుకున్న మోడి

Posted: 12/23/2014 06:38 PM IST
Narendra modi praises pawan kalyan gopala gopala singer kailash kher

మంచి పని చేస్తే ఎవరైనా మెచ్చుకుంటారు. కాని ప్రధాని నుంచి ప్రశంసలు పొందటం అంటే మామూలు విషయం కాదు. పవన్ కోసం పాట పాడిన ఖైలాష్ ఖేర్ కు ఈ గౌరవం దక్కింది. స్వచ్ఛ భారత్ మిషన్ లో పాల్గొన్నందుకు ఖేర్ ను ప్రధాని ప్రశంసించారు. వారణాసిలోని భదైని ఘాట్ లో సోమవారం రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఖేర్, చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశాడు. అంతేకాకుండా తన ఛాలెంజ్ ను స్వీకరించాలంటూ 9మంది సెలబ్రిటీలను నామినేట్ చేశాడు.

వారణాసి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మోడి ఈ విషయం తెలుసుకుని ఖేర్ ను ప్రశంసించారు. గాయకుడికి గంగామాత ఆశీర్వాదం లభిస్తుందని చెప్పారు. ‘అరుంధతి’లో ‘కమ్ముకున్నా...’, అనే పాట ‘మిర్చి’లో ‘పండగలా దిగివచ్చావు..’ అనే పాటలు పాడి పాపులర్ అయిన బాలీవుడ్ సింగర్ కైలాష్ ఖేర్ తెలుగులో మరో పాట పాడాడు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘గోపాల గోపాల’ సినిమా కోసం ఓ పాట పాడాడు. అయితే ఆడియో విడుదల కానందు వల్ల ఖేర్ పాడిన పాట వివరాలు బయటకు చెప్పటం లేదు.

singer-kailash-kher

ఈ మూవీకి సంగీతం అందిస్తున్న అనూప్ రూబెన్స్ విజ్ఞప్తి మేరకు ఖేర్ పాట పాడాడు. ఈ స్పెషల్ సాంగ్ బాగా వచ్చిందని అనూప్ తో పాటు డైరెక్టర్ కిశోర్ కూడా ఆనందం వ్యక్తం చేశాడు. అటు పవన్ సినిమాకు పాట పాడటం పట్ల కైలాష్ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. తాను గతంలో పాడిన ఏ పాటకు ఇంతలా ఆత్మసంతృప్తి కలగలేదన్నారు. తాను పాడిన పాటల్లో ‘గోపాల గోపాల’ సినిమా పాట చాలా అరుదైనదిగా చెప్పారు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న ఈ సినిమా ఆడియో ఈనెలారున విడుదల కానుంది. ఇప్పటికే విడుదల అయిన పవన్, వెంకటేష్ ఫోటోలు ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kailash kher latest  narendra modi swachh bharat  gopala gopala  

Other Articles