Telugu actor ahuti prasad cancer hospitalized

ahuti prasad cancer, ahuti prasad suffers cancer, ahuti prasad hospitalized, ahuti prasad cancer treatment, ahuti prasad latest updates, ahuti prasad best comedy videos, ahuti prasad movies, tollywood latest news updates, 2014 tollywood sad happy incidents

telugu actor ahuti prasad cancer hospitalized : tollywood popular character artist ahuti prasad hospitalized few days ago rumors that he is suffers from dangerous cancer disease

మంచి నటుడిని పీడిస్తున్న మాయదారి రోగం...?

Posted: 12/20/2014 08:42 AM IST
Telugu actor ahuti prasad cancer hospitalized

కమెడియన్, తండ్రి, విలన్ సహా ఇతర పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘ఆహుతి’ ప్రసాద్ గా చెరగని ముద్ర వేసిన ప్రసాద్ కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో ఆయన వైద్య సేవలు పొందుతున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రసాద్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు అని అందరూ చెప్పారు.., తప్ప ఆయనకు ఏమయిది అని ఎవరూ చెప్పలేకపోయారు. కుటుంబ సభ్యులు కూడా నటుడికి ఏ ఇబ్బంది వచ్చిందో బయటకు చెప్పలేదు. దీనిపై వాకబు చేయగా అనారోగ్యంకు కారణం తెలిసింది.

ప్రసాద్ ను ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి పీడిస్తోందని పలువురు సన్నిహితులు తెలిపారు. ఈ విషయం ప్రశ్నించినా కుటుంబ సభ్యుల నుంచి సరైన సమాచారం రాలేదు. అయితే క్యాన్సర్ కు చికిత్స తీసుకునేందుకే ఆయన ఆస్పత్రిలో చేరినట్లు సన్నిహితులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధికి చికిత్స అందుబాటులో ఉండటంతో పాటు.., ప్రసాద్ ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందని తెలుస్తోంది. ఇది సంతోషించాల్సిన విషయం. కానీ..,  మహమ్మారి వ్యాధి నుంచి ఆయన త్వరగా బయట పడాలని ‘తెలుగు విశేష్’ కోరుకుంటోంది. ప్రసాద్ ఆరోగ్యం గురించి తెలిసిన టాలీవుడ్ వర్గాలు విచారం వ్యక్తం చేశాయి. మంచి మనిషి త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షించారు.

ప్రసాద్ కెరియర్ :

తెలుగు ఇండస్ర్టీలో అందరూ హీరోలే వస్తున్న తరణంలో ఉన్న కొద్ది మంది క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఆహుతి ప్రసాద్ ఒకరు. కృష్ణా జిల్లాకు చెందిన ఈయన అసలు పేరు అడుసుమిల్లి జనార్ధన్ వర ప్రసాద్. నాగార్జున హీరోగా నటించిన ‘విక్రమ్’ సినిమాతో ఇండస్ర్టీలోకి అడుగు పెట్టి అనేక క్యారెక్టర్లు చేశారు. ‘మల్లె మొగ్గలు’ అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. శ్యాం ప్రసాద్ రెడ్డి సినిమా ‘ఆహుతి’తో పాపులర్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అనే సినిమాకు 2003లో ఉత్తమ విలన్ గా, ‘చందమామ’ సినిమాకు ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రెండు సార్లు నంది అవార్డులు అందుకున్నారు. సినీ జీవితంలో దాదాపు 125 సినిమాల్లో ప్రసాద్ నటించారు.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ahuti prasad cancer  tollywood updates  cancer treatment hyderabad  

Other Articles