శంకర్ ది వండర్ క్రియేటర్ అని మరోసారి నిరూపితమైంది. తొలి ట్రైలర్ తో అందర్నీ ఆకట్టుకున్న ‘ఐ’ రెండవ ట్రైలర్ తో మరింతగా క్రేజు సంపాదించుకుంది. గురువారం రాత్రి విడుదల అయిన తమిళ్ వర్షన్ రెండవ ట్రైలర్ మతిపోగొడుతోంది. రెండు నిమిషాల పాటు ఉన్న ఈ ట్రైలర్ ఎక్కడా క్షణం పాటు కనురెప్ప ఆర్పనివ్వటం లేదని టాక్ విన్పిస్తోంది. అందుకే విడుదల అయిన పదకొండు గంటల్లోనే ట్రైలర్ ను చూసిన వారి సంఖ్య ఆరు లక్షలకు చేరువలో ఉంది. తొలి ట్రైలర్ తోనే సినిమా హాలీవుడ్ రేంజ్ ను దాటుతుందని చెప్పిన శంకర్ మాటలు ఈ ట్రైలర్ చూస్తే నమ్మక తప్పదు.
విక్రమ్, అమీజాక్సన్ లీడ్ క్యారెక్టర్లుగా రూపొందిన ‘ఐ’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకున్న మూవీకి బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే ఇందులో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవని స్పష్టం అవుతోంది. వివాదాల కంటే వింతలను చూపించటానికి ఇష్టపడే శంకర్.., ఈ ప్రాజెక్టుతో భారతీయులు కూడా హాలీవుడ్ సినిమాలు తీయగలరని నిరూపించటం ఖాయమన్పిస్తోంది. ఆస్కార్ బ్యానర్స్ పై 180 కోట్ల రూపాయలతో రవిచంద్రన్ నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు దేశీయ, అంతర్జాతీయ భాషల్లో సినిమాను డబ్ చేసి విడుదల చేస్తున్నారు.
తెలుగులో ఈ సినిమాను మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై డబ్బింగ్ విడుదల చేస్తున్నారు. ఎ.ఆర్. రెహ్మన్ అందించిన సంగీతానికి తమిళంలో మంచి స్పందన వచ్చింది. త్వరలోనే తెలుగు పాటలూ విడుదల కానున్నాయి. తెలుగు ఆడియో రిలీజ్ కు చాకీచాన్ హాజరుకానున్నారు. ఇండియన్ ఫిలిం ఇండస్ర్టీ అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్న ‘ఐ’ సినిమా విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తాము. కానీ ప్రస్తుతానికి ట్రైలర్ ను మీకోసం అందిస్తున్నాము.
సెన్సార్ పనులు కడూా
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jun 01 | బ్రహ్మాస్త్ర ఫిల్మ్‌కు చెందిన కొత్త అప్డేట్ వచ్చింది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ ఫిల్మ్‌కు చెందిన కొత్త టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌తో పాటు ఇతర స్టార్స్ ఉన్న ఆ... Read more
Jun 01 | బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాథ్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. కేకేగా చిరపరిచితమైన ఆయన కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు. కేకే పాటలకు స్టెప్పులేసిన అభిమానులు.. ఆ... Read more
May 30 | కరోనా లాక్ డౌన్ లో వాయిద పడ్డ సినిమాలన్ని వరుస పెట్టి విడుదల అవుతున్నాయి. గతేడాది పుష్ప, అఖండ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ధైర్యాన్ని ఇచ్చాయి. అదే క్రమంలో... Read more
May 30 | ఉప్పెన' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పర్చుకన్న మంగళూరు బ్యూటీ కృతిశెట్టి తన కెరీర్ లోనూ విజయాల పరంపరను సోంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తొలి... Read more
May 30 | యాక్టింగ్‌లోనే కాదు సినిమా ప్రమోషన్లలోనూ తన దారి సపరేటు అని నిరూపించారు ప్రముఖ నటుడు, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు. తాను నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యానని చెప్పిన మహేశ్ బాబు.. త్వరలో విడుదల కానున్న... Read more