Actress vedika princes roles mollywood movies

actress vedika, vedika hot photos, vedika photo shoot, vedika movies, mollywood movies, vedika mollywood movies, mollywood actresses, vedika princes roles, telugu actresses, vedika interview, telugu news

actress vedika princes roles mollywood movies : actress vedika getting more offers in mollywood as princes role. That why she got name as mollywood princes

ఆ పాత్రలు చాలా గమ్మత్తుగా వున్నాయట!

Posted: 12/13/2014 04:27 PM IST
Actress vedika princes roles mollywood movies

ఒకప్పుడు టాలీవుడ్’లో 'విజయదశమి', 'బాణం', 'దగ్గరగా దూరంగా' వంటి సినిమాలలో నటించి ఆ తరువాత కనుమరుగైన నటి వేదిక.. ఇప్పుడు మాలీవుడ్’లో వరుసగా సరికొత్త పాత్రల్లో నటిస్తూ ఎంజాయ్ చేస్తోందట! గతంలో కంటే ఇప్పుడే తాను ఆయా పాత్రల్లో నటిస్తూ మంచి అనుభూతిని పొందుతున్నట్లు స్వయంగా పేర్కొంటోంది కూడా! మాలీవుడ్’లో తాను నటిస్తున్న ఆ పాత్రలు చాలా గమ్మత్తుగా వున్నాయని, అందుకు తాను చాలా సంతోషంగా వున్నట్లు తెలుపుతోంది.

ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో నటిగా తనను తాను నిరూపించుకోవడానికి వేదిక ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ.. ఫలితం మాత్రం దక్కలేదు. వరుస విజయాలు వచ్చినప్పటికీ ఆమెకు మాత్రం సరైన స్థానం దక్కలేదు. దాంతో కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా వుంది. తరువాత తమిళంలో 'కావ్యతలైవన్' సినిమాలో నటించింది కానీ.. అక్కడ కూడా ఛాన్సులు లేవు. దాంతో మాలీవుడ్’లో ఆమెకు రాకరాక వచ్చిన అవకాశాన్ని అదునుగా తీసుకుని.. తన నటనాప్రతిభతో ప్రేక్షకుల్ని కట్టిపడేసంది. కోల్పోయిన తన ఇమేజీని అక్కడ తిరిగి మళ్లీ క్రియేట్ చేసుకుంది.

ఇటీవలే ఈ అమ్మడు 'సింగారవేలన్' అనే మలయాళ చిత్రంలో యువరాణిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. అందులో ఈమె నటనకు అక్కడి ప్రజలు దాసోహం కావడంతో.. ‘కజిన్’ అనే చిత్రంలో కథానాయికగా అవకాశం దక్కించుకుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఇందులో కూడా అమ్మడు యువరాణి పాత్రనే పోషిస్తోంది. దీంతో ఈ అమ్మడికి ‘‘మాలీవుడ్ యువరాణి’’ అనే బిరుదు కూడా వచ్చేసింది.

ఇదే విషయమై వేదిక మాట్లాడుతూ... 'మలయాళంలో వరుసగా అవకాశాలు వస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. అలాగే వరుసగా యువరాణి పాత్రలు చేయడం గమ్మత్తుగా వుంది' అని చెబుతోంది. ఇంకో విషయం ఏమిటంటే.. ఈమెలో నటి నగ్మా పోలికలు చాలా దగ్గరగా వుండటంతో అక్కడ అవకాశాలు బాగొస్తున్నాయని కొందరి విశ్లేషకుల వాదన!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress vedika  mollywood actresses  malayalam film industries  telugu news  

Other Articles