Gabriela bertante friends house thief story

Gabriela bertante news, Gabriela bertante hot photos, Gabriela bertante photo shoot, Gabriela bertante hot gallery, Gabriela bertante item songs, Gabriela bertante thief story

Gabriela bertante friends house thief story

ఇంట్లో దూరిన దొంగకు.. ఇక్కట్లు పెట్టింది!

Posted: 12/13/2014 03:55 PM IST
Gabriela bertante friends house thief story

‘‘డిస్ట్రర్బ్ చేత్తున్నడే దొంగ పిల్లడు’’ అంటూ తన వంపుసొంపులతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని కట్టిపడేసిన గాబ్రియేలా బెర్ట్రాండే.. ఒక దొంగకు నిజంగానే చుక్కలు చూపించిందట! ఇదేదో సినిమాలో జరిగిన ఫీట్ కాదు.. రియల్ లైఫ్’లో జరిగిన ఘటనే! ఇంట్లో వున్న డబ్బులను, ఇతర సామాగ్రిలను దోచుకుని పారిపోతుండగా.. అతనిని పట్టుకునే క్రమంలో దొంగకు బాగానే పరుగులు పెట్టించిందట!

ఇటీవలే గాబ్రియేలా తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి సరదాగా గడుపుతుండగా.. అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి దూరాడు. ఇంట్లో వున్న భారీ సొత్తు, నాలుగు ఫోన్లు, ఇతర సామాగ్రీని దొంగలించి పారిపోవడానికి ప్రయత్నించాడు. అప్పుడే ఆ దొంగను చూసిన గాబ్రియేలా.. ఆ దొంగను పట్టుకునే క్రమంలో అతగానిని చెమటలు పట్టించేలా పరుగులు పెట్టించిందట! ఆ దొంగ తన చేతిలో కత్తి పట్టుకుని బెదిరించడానికి ప్రయత్నించినా.. గాబ్రియేలా మాత్రం అందుకు జంకకుండా సాహసంగా వాడిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. దాంతో ఉరుకులు తీస్తూ స్విమ్మింగ్’పూల్ వైపు పరిగెత్తగా.. గాబ్రియేలా తెలివిగా అడ్డుకుంది. ‘హెల్ప్ హెల్ప్’ అంటూ ఇద్దరూ అరిచారు కూడా! అయితే చివరికి దొంగ అక్కడి నుంచి ఎలాగోలా పారిపోయాడు.

అతడు పారిపోతే పారిపోయాడుగానీ.. ఈ మొత్తం ఎపిసోడ్’లో గాబ్రియేలా ప్రదర్శించిన సాహసానికి అందరూ మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఆమె స్నేహితురాలు గాబ్రియేలాను ఆకాశానికెత్తేసింది. దొంగను పట్టుకునే క్రమంలో గాబ్రియేలా ఎంతో సాహసంగా అతగాడిని ఎదిరించిందంటూ పేర్కొంటోంది. దీంతో ఈ అమ్మడు సాహసవనితగా వార్తల్లో నిలిచిపోయింది. కానీ.. ఆ దొంగను పట్టుకోలేదనే బాధలో గాబ్రియేలా వుండిపోయిందని సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gabriela bertante  item songs actresses  telugu news  

Other Articles