Salman khan forbes india no 1 celebrity

forbes india celebrity list, forbes india celebrity first place, forbes india rich perosn list, forbes list 2014, salman khan movies, salman khan latest movies, salman khan sister marriage highlights, salman khan cases, salman khan shah rukh khan war, shah rukh khan in forbes list, shah rukh khan movie updates, amitabh bachan latest updates

salman khan forbes india no.1 celebrity : bollywood body builder star salman khan announced as forbes india 2014 celebrity with no1 place second place by amitabh bachan, shah rukh khan lost forbes india celebrity top place in 2014 by his friend salman khan

బాలీవుడ్ నయా భాద్ షా.., షారూఖ్ కు షాకిచ్చిన సల్మాన్

Posted: 12/12/2014 01:51 PM IST
Salman khan forbes india no 1 celebrity

అర్పిత పెళ్లితో తిరిగి స్నేహితుడుగా మారిన షారూక్ కు సల్మాన్ పెద్ద షాకే ఇచ్చాడు. ఇన్నాళ్ళు షారూక్ పేరిట ఉన్న బాలీవుడ్ బాద్ షా పేరు ఇప్పుడు ఆయన స్నేహితుడు సల్మాన్ ను వరించింది. ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 2014 జాబితాను ప్రకటించింది. ఈ లిస్ట్ లో సల్లూ భాయ్ టాప్ ప్లేస్ లో నిలిచాడు. మూడవ సారి ప్రకటించిన ఈ జాబితాలో సల్మాన్ ఫస్ట్ ప్లేస్ కొట్టేయటం ఇదే తొలిసారి. ఏడాదిలో (01అక్టోబర్ 2013నుంచి 30సెప్టెంబర్ 2014 పరిగణలోకి తీసుకున్నారు) సినిమా విడుదల కాకపోవటంతో షారూక్ ప్లేస్ పడిపోయింది. ఆయన మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సల్మాన్ విషయానికి వస్తే.., సినిమాలు రావటంతో పాటు.., ప్రజల్లో నిలిచిన వ్యక్తిగా పేరు పొందారు. కోర్టు కేసులు, వివాదాలు, ఛారిటీలు ఇలా ప్రతి విషయంలో సల్మాన్ పేరు మార్మోగటంతో సెలబ్రిటీ ఆఫ్ ది ఇయర్ అయ్యారు.

ఇక లిస్ట్ లో నంబర్ 2 ప్లేస్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు దక్కింది. గతంలో 5వ స్థానంలో ఉన్న బచ్చన్ కు ఇది ప్రమోషన్ అనే చెప్పాలి. 12మిలియన్లకు పైగా ట్విట్టర్ ఫాలోవర్లతో దేశంలోనే పాపులర్ పర్సన్ గా నిలిచారు. మూడవ స్థానంలో ఉన్న షారూక్ ఖాన్ ఈ ఏడాదిలో రూ.202 కోట్లు సంపాదించాడు. ఇక టాప్ టెన్ లో ఈ సారి ఒకే హీరోయిన్ ప్లేస్ సంపాదించింది. కాంట్రవర్సీ కామెంట్లు చేసే దీపికా పడుకునే ఈ సారి పదిమంది సెలబ్రటిల లిస్ట్ లో ప్లేస్ పొందింది. ఇందుకోసం కత్రినాను అమ్మడు పక్కకు నెట్టేసింది.

ఆశ్చర్యకరంగా ఈ ఏడాదిలో సినిమా చేయకపోయినా.., ఐపీఎల్ ఫ్రాంచైజీ సహ యజమానిగా, వాడియాతో వివాదాలతో వార్తలకెక్కిన సొట్ట బుగ్గల ప్రీతి జింటా 14వ ప్లేస్ లో నిలిచింది. ఇక టాప్ 100మందిలో ప్లేస్ పొందిన వారిని చూస్తే.., సింగర్ అర్జిత్ సింగ్, క్రికెటర్ అజెంక రెహానె, అర్జున్ కపూర్, అలియా భట్, రజినికాంత్, ధనుష్, సన్ని లియోన్, కంగనా రనౌత్, కమెడియన్ కపిల్ శర్మ తదితరులు ఫోర్బ్స్ జాబితాలో నిలిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : salman khan  forbes india  shahrukh khan  forbes india celebrity  

Other Articles